Bichagadu 2 OTT Release Date:  తమిళ నటుడు విజయ్ ఆంటోని హీరోగా నటించిన 'బిచ్చగాడు 2 (తమిళంలో పిచైక్కారన్ 2) ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. మరికొద్ది రోజుల్లో ‘బిచ్చగాడు 2’ మీ ఇంటికి వచ్చేస్తాడట. అదేనండి ఈ మూవీ ఓటీటీ (OTT)లోకి వచ్చేస్తోంది. దీనిపై తాజాగా అధికారిక ప్రకటన విడుదలైంది.


విజయ్ ఆంటోని నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటించింది. కాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కానీ ఆ రిలీజ్ ఎప్పుడన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. జూన్ 17 లేదా జూన్ 23న వస్తుందని ఆన్ లైన్ లోకి వస్తుందని చాలా మంది భావించారు. ఈ సస్పెన్స్ పై తాజాగా హాట్ స్టార్ డిజిటల్ ప్రీమియర్ తేదీని అనౌన్స్ చేసింది. తమిళం, తెలుగు భాషల్లో జూన్ 18, 2023 నుంచి ఈ చిత్రాన్ని తమ ప్లాట్‌ఫారమ్‌లో ప్రీమియర్ చేయనున్నట్లు హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది. దీంతో మొన్నటిదాకా థియేటర్లో చూసి ఎంజాయ్ చేసిన ఆడియెన్స్.. ఇప్పుడు ఇంట్లో తీరిగ్గా కూర్చొని ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


విజయ్ ఆంటోనీ, కావ్యా థాపర్ కలిసి నటించిన 'బిచ్చగాడు 2' కూడా 2016లో రిలీజైన తొలి పార్ట్ 'బిచ్చగాడు'లాగే బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. తెలుగులోనూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. ఇక ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ, కావ్యా థాపర్ తో పాటు దేవ్ గిల్, రాధా రవి, YG మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పెరడి, జాన్ విజయ్, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ సంగీతం కూడా అందించాడు. 


2016లో విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించిన 'బిచ్చ‌గాడు' మూవీ బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ మూవీగా నిలిచింది. మ‌ద‌ర్ సెంటిమెంట్‌కు ప్రేక్ష‌కులు బాగా క‌నెక్ట్ కావ‌డంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపించింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సీక్వెల్‌గా విజ‌య్ ఆంటోనీ 'బిచ్చ‌గాడు -2'ను తెర‌కెక్కించారు. సీక్వెల్ అని చెప్పారు గానీ.. పార్ట్ 1 కు, పార్ట్ 2కు ఎలాంటి సంబంధం ఉండదు. 'బిచ్చ‌గాడు పార్ట్ 1'లో సెంటిమెంట్‌కు ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇస్తే.. సీక్వెల్ లో మాత్రం బ్రెయిన్ మార్పిడి అనే ప్ర‌యోగాత్మ‌క పాయింట్‌కు యాక్ష‌న్ అంశాల‌ను జోడించి న‌డిపించారు. చివ‌రి వ‌ర‌కు క‌థ‌ను ఉత్కంఠ‌భ‌రితంగా న‌డిపించ‌డంలో చాలా వ‌ర‌కు విజ‌య్ ఆంటోనీ స‌క్సెస్ అయ్యారనే చెప్పాలి. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంట్ త‌ర్వాత విజ‌య్ ప్లేస్‌లోకి వ‌చ్చిన సత్యం ఏం చేయ‌బోతున్నాడ‌న్న‌ది ఊహ‌ల‌కు అందకుండా చ‌క్క‌టి మ‌లుపుల‌తో స్క్రీన్‌పై ఆవిష్క‌రించడం ఆడియెన్స్ కు మరింత ఆసక్తిని రేకెత్తించింది.


Read Also : Project K : ప్రభాస్ మూవీలో విలన్‌గా కమల్ హాసన్ ఫిక్స్? ఆగస్టులో షూటింగ్!