ప్రేమ, డిప్రెషన్, హర్ట్ ఎటాక్, కారణం ఏదైతేనేం సినీ పరిశ్రమలో వరుస విషాదాల సంఘటనలు జరుగుతున్నాయి. ఆకస్మికంగా చనిపోతూ షాక్ కు గురి చేస్తున్నారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ ఆత్మహత్య  చేసుకున్న ఘటన ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే సూసైడ్‌కు పాల్పడింది. చిన్న వయసులోనే మంచి అవకాశాలతో రాణిస్తున్న హీరోయిన్, అందరినీ విషాదంలో నింపుతూ కానరాని లోకాలకు వెళ్లిపోయింది.


వారణాసిలోని హోటల్లో ఉరేసుకుని ఆత్మహత్య


25 ఏళ్ల ఆకాంక్ష, భోజ్ పురి సినిమా పరిశ్రమలో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. తాజాగా ఓ సినిమా షూటింగ్ కోసం ఉత్తరప్రదేశ్ లోని వారణిసికి వచ్చింది. ఆమె కోసం సారనాథ్ ప్రాంతంలోని హోటల్ రూమ్ బుక్ చేశారు ఫిల్మ్ మేకర్స్. నిన్న షూటింగ్ ముగించుకుని ఆమె హోటల్‌కు చేరుకుంది. అదే హోటల్ లో తను ఉరి వేసుకుని చనిపోయింది. సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఆకాంక్ష ‘మేరు జంగ్ మేరా ఫైస్లా’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ‘ముజ్ సే షాదీ కరోగి’, ‘వీరన్ కే వీర్’, ‘ఫైటర్ కింగ్’ లాంటి భోజ్‌ పురి సినిమాల్లో నటించింది. సినిమాలతో పాటు మ్యూజిక్ వీడియోలను కూడా చేస్తోంది. తాజాగా తన కొత్త సినిమా ‘నాయక్’ షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే తను ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తన సూసైడ్ కు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీలోకి రాక!  


ఆకాంక్ష దూబే 21, అక్టోబర్ 1997న ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో జన్మించింది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యింది. చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌, యాక్టింగ్‌ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. టిక్‌టాక్, ఇన్‌ స్టాగ్రామ్‌‌లో తన డ్యాన్స్ , యాక్టింగ్ వీడియోలను షేర్ చేసేది. అవి బాగా వైరల్ కావడంతో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇన్‌ స్టాగ్రామ్‌‌లో చనిపోయే వరకు కూడా తను  చాలా యాక్టివ్‌గా ఉండేది.  ఇన్‌ స్టాలో ఆకాంక్ష దూబేకి  సుమారు 17 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. చనిపోవడానికి ముందు తన ఇన్ స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. జస్ట్ ట్రై.. అంటూ డ్యాన్స్ వీడియోను అభిమానులతో పంచుకుంది.






ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమా?


గత వాలంటైన్స్ డే సందర్భంగా  సహనటుడు సమర్‌ సింగ్‌ తో కలిసి ఫోటోలను షేర్ చేసింది. ‘హ్యాపీ వాలెంటైన్స్ డే' అని పోస్టు చేసింది. దీంతో ఆమె మృతికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఆమె భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించారు. పోలీసుల ఎంక్వయిరీలో ఆమె చనిపోవడానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.


Read Also: నా వల్లే ‘RRR’కు ఆస్కార్ వచ్చింది, అజయ్ దేవగన్ సంచలన వ్యాఖ్యలు!