Ravi Teja's Bhartha Mahasayulaku Wignyapthi Teaser Out : మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతోన్న కామెడీ ఎంటర్టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
టీజర్ ఎలా ఉందంటే?
ఓ సెన్సిటివ్ అంశాన్నీ కామెడీ టచ్‌తో మూవీ రూపొందించినట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. టీజర్ ప్రారంభంలోనే హీరో ఓ సైకాలజిస్ట్‌ను కలిసి తన ప్రాబ్లమ్ ఏంటో చెబుతాడు? ఆ తర్వాత కామెడీ టచ్, డైలాగ్స్‌తో టీజర్ అదిరిపోయింది. 'నీకు వైఫ్ ఉందని నాకు ఎందుకు చెప్పలేదు?' అంటూ హీరోయిన్ అడగ్గా... 'వదిన వాళ్ల చెల్లి అంటే వైఫేగా?' అంటూ తనదైన కామెడీతో అదరగొట్టారు రవితేజ.
Also Read : 'అఖండ 2' థియేటర్లలో పేలిన బాక్సులు - సౌండ్ మిక్సింగ్ విమర్శలపై తమన్ స్ట్రాంగ్ కౌంటర్
మూవీలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవితేజ కెరీర్‌లో ఇది 76వ మూవీ. వెన్నెల కిషోర్, సునీల్, మురళీ ధర్ గౌడ్, సత్య, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా... భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ కానుంది. రీసెంట్‌గా వచ్చిన 'మాస్ జాతర' నిరాశపరచడంతో ఈ మూవీతో హిట్ కొట్టాలని రవితేజ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.