'భైరవం'లో ముగ్గురు హీరోలు నటించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. యాక్షన్ థ్రిల్లర్ కింద తెరకెక్కిన ఈ సినిమాలో హీరోల మధ్య కనెక్షన్ ఏమిటి? వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏమిటి? అనేది ఒక్క పాటలో చెప్పేశారు. ఆ పాట 'డమ్ డమారే...'ను తాజాగా విడుదల చేశారు.

రామ లక్ష్మణుల కోసం నిలబడిన ఆంజనేయుడు'రాముడిలాగా ఒకడుంటే... లక్ష్మణుడేగా ఇంకొకడు... ఇద్దరి కోసం నేనుంటా ఆంజనేయుడిలా' - ఇదీ 'భైరవం' సినిమా నుంచి తాజాగా విడుదలైన 'డమ్ డమారే...' పాటలో ఒక లైన్. దీనిని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పాడారు. 

రాముడిలా ఒకడుంటే అన్నప్పుడు నారా రోహిత్‌ను చూపించారు. లక్ష్మణుడేగా ఇంకొకడు అన్నప్పుడు మనోజ్ మంచును చూపించారు. వాళ్లిద్దరూ రామ లక్ష్మణులు అయితే తాను ఆంజనేయుడు అన్నట్టు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పారన్నమాట. ఈ పాటలో ముగ్గురు హీరోల మధ్య స్నేహాన్ని చక్కగా ఆవిష్కరించారు. జయసుధతో పాటు హీరోయిన్లు ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళైలను చూపించారు.

Also Read: ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజుతో 'డ్యూడ్'ను చూశారా?

మే 30వ తేదీన థియేటర్లలోకి 'భైరవం'Bhairavam Release Date: విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకం మీద కేకే రాధామోహన్ 'భైరవం' సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతి లాల్ గడా సమర్పిస్తున్నారు. మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Also Readబికినీలో రమ్య పసుపులేటి... థాయ్‌లాండ్‌లో తెలుగమ్మాయ్ షికార్లు చూశారా?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై హీరో హీరోయిన్లుగా... జయసుధ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి మాటలు: సత్యర్షి - తూమ్ వెంకట్, పాటలు: భాస్కరభట్ల రవి కుమార్ - కాసర్ల శ్యామ్ - చైతన్య ప్రసాద్ - బాలాజీ, తిరుపతి, ఫైట్ మాస్టర్స్: రామకృష్ణ - నటరాజ్ మడిగొండ,ఛాయాగ్రహణం: హరి కె వేదాంతం, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మా కడలి, కూర్పు: చోటా కే ప్రసాద్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, నిర్మాత: కేకే రాధామోహన్, సమర్పణ: డా. జయంతి లాల్ గడా (పెన్ స్టూడియోస్), కథ - స్క్రీన్‌ ప్లే - దర్శకత్వం: విజయ్ కనకమేడల.