Ritabhari Chakraborty: బెంగాలీ ఇండస్ట్రీలోనూ లైంగిక వేధింపులు, విచారణ జరిపించాలని సీఎం మమతను డిమాండ్ చేసిన నటి రితాభరి

బెంగాలీ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై విచారణ జరిపించాలని నటి రితాభర చక్రవర్తి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫేస్ బుక్ వేదికగా సీఎం మమతా బెనర్జీకి ట్యాగ్ చేస్తూ ఓ పోస్టు పెట్టింది.

Continues below advertisement

Actor Ritabhari Chakraborty Sexual Harassment Cases: మలయాళీ సినీ పరిశ్రమలో రోజుకో లైంగిక వేధింపుల వ్యవహారం బయటకు వస్తున్న నేపథ్యంలో.. ఇతర సినిమా పరిశ్రమల్లోని మహిళా నటులు సైతం లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బెంగాలీ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల కేసులకు సంబంధించిన పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని బెంగాలీ నటి రితాభరి చక్రవర్తి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫేస్ బుక్ వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టింది. సినీ పరిశ్రమలోని పలువురు నటులు, నిర్మాతలు, దర్శకుల నుంచి మహిళా నటులకు వేధింపులు ఎదురవుతున్నాయని రితాభరి వెల్లడించింది. బెంగాళీ ఇండస్ట్రీలోనూ హేమ కమిటీ లాంటి సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆమె డిమాండ్ చేశారు.  

Continues below advertisement

సీఎం మమతా బెనర్జీకి ట్యాగ్ చేస్తూ ఫేస్ బుక్ పోస్టు

బెంగాలీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రితాభరి చక్రవర్తి తన ఫేస్ బుక్ పోస్టును సీఎం మమతా బెనర్జీకి ట్యాగ్ చేసింది. లైంగిక వేధింపుల కేసులపై విచారించి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే, రితాభరి తన పోస్టులో ఎవరి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అయితే, ఇండస్ట్రీలో వేధింపులకు పాల్పడే నిందితుల్లో చాలా మంది కోల్ కతాలోని ఆర్ జి కర్ ఆస్పత్రి డాక్టర్ హత్యాచార వ్యతిరేక నిరసనల్లో సిగ్గులేకుండా పాల్గొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇంతకీ నటి రితాభరి ఫేస్ బుక్ పోస్టులో ఏం రాసిందంటే.?

"మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులను బట్టబయలు చేస్తూ హేమ కమిటీ నివేదిక ఇచ్చింది. బెంగాలీ పరిశ్రమలోనూ ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నన్ను ఆలోచిపంజేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టులో   చాలా నివేదికలు నాకు ఎదురైన అనుభవాల మాదిరిగానే ఉన్నాయి. నాకు తెలిసిన ఇలాంటి కీచక నటులు, నిర్మాతలు, దర్శకులు ఆర్ జి కర్ బాధితురాలి కోసం కొవ్వొత్తులను పట్టుకుని నిస్సిగ్గుగా ర్యాలీలో పాల్గొన్నారు. ఇప్పటికైనా ఈ మానవ మృగాల ముసులు విప్పాల్సిన సమయం వచ్చింది. ఈ రాక్షసులకు వ్యతిరేకంగా గళం విప్పాలని తోటి నటులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మగాళ్లలో చాలా మంది ఇండస్ట్రీని ప్రభావితం చేసే వాళ్లే ఉన్నారు. వారి గురించి మాట్లాడితే అవకాశాలు కోల్పోతామని భావించకూడదు. ఇంకా ఎంత కాలం నిశ్శబ్దంగా ఉందాం? ఎన్నో కలలు కంటూ యువ నటీమణులు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. కానీ, ఇది షుగర్ కోటెడ్ వ్యభిచార గృహం తప్ప మరొకటి కాదని నమ్ముతున్నా. సీఎం మమతా బెనర్జీ కూడా హేమ కమిటీ లాంటి సంస్థను ఏర్పాటు చేయడంతో పాటు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి” అని కోరింది. నటి రితాభరి మమతా బెంగాలీ మూవీస్ 'ఛోతుష్‌కోన్' (2014), 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ కోల్‌కతా' (2014), 'బవాల్' (2015), 'ఫటాఫతి' (2022) లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు.  

అటు ఈ నెల ప్రారంభంలో సీనియర్ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర, మలయాళ దర్శకుడు రంజిత్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. చాలా మంది బెంగాలీ దర్శకులు, నటులు కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పిన ఆమె, అయితే, తనకు అక్కడ ఎలాంటి వేధింపులు ఎదురుకాలేదన్నది.  

Also Read: ఆయన అలా అడగడంతో ఇబ్బంది పడ్డా - వెంటనే మమ్ముట్టి సర్‌కి ఫిర్యాదు చేశా - నటి అంజలి

Continues below advertisement