Bellamkonda Anupama Parameswaran Kishkindapuri First Poster Released: ఇటీవల సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) తాజాగా మరో హారర్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్నారు. ఆయన చివరిసారిగా ప్రభాస్ 'ఛత్రపతి' హిందీ రీమేక్‌లో హీరోగా నటించారు. మరోసారి హిట్ పెయిర్‌తో ఎంటర్‌టైన్ చేయనున్నారు.
హిట్ కాంబో రిపీట్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జోడీగా మరోసారి సందడి చేయనున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'రాక్షసుడు' బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు మరో హారర్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్నారు. 'చావు కబురు చల్లగా' ఫేమ్ కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్ 'కిష్కింధపురి'లో (Kishkindapuri) నటిస్తున్నారు.
ఆసక్తికరంగా ఫస్ట్ పోస్టర్ రిలీజ్
ఈ మూవీ నుంచి ఫస్ట్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా మేకర్స్ రిలీజ్ చేశారు. 'కిష్కింధపురి.. ఇక్కడ కొత్త భయానక యుగం ప్రారంభమవుతుంది.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అడవిలో ఓ పాడుపడిన కోట బ్యాక్ గ్రౌండ్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ ఆందోళనతో టార్చ్ వెలుతురులో ఏదో వెతుకున్నట్లుగా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఈ నెల 29న రిలీజ్ కానుంది.
ప్రతిష్టాత్మక షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా.. అధికారికంగా రిలీజ్ డేట్, ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
Also Read: భర్తలూ.. టీవీ ఆర్పారో ఇక అంతే! - డిఫరెంట్ రోల్‌లో సమంత.. 'శుభం' ట్రైలర్ అదిరిపోయిందిగా..