మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (Bhartha Mahasayulaku Wignyapthi Movie). 'నేను శైలజ', 'వున్నది ఒక్కటే జిందగీ', 'చిత్రలహరి' సినిమాల ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదల కానుందీ సినిమా. ఇందులోని తొలి పాట 'బెల్లా బెల్లా ఇసా బెల్లా...' విడుదల చేశారు. ఆ సాంగ్ లిరిక్స్ చూస్తే...
ట్రెండీ & పెప్పీ సాంగ్...సురేష్ గంగుల ఏం రాశారంటే?'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (BMW Movie) సినిమాలో మొదటి పాట 'బెల్లా బెల్లా ఇసా బెల్లా...'కు సురేష్ గంగుల సాహిత్యం అందించారు. 'మాస్ జాతర'లో 'సూపర్ డూపర్ హిట్ సాంగ్' రాశారు సురేష్. రవితేజతో ఆయనకు రెండో గీతమిది. 'మాస్ జాతర' రిజల్ట్ పక్కన పెడితే... సురేష్ గంగుల రాసిన సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడీ పాట వింటే ఇదీ చార్ట్ బస్టర్ అవ్వడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.
'భర్త మహాశయులకు విజ్ఞప్తి'కి భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడు. ఆయన అందించిన బాణీకి సురేష్ గంగుల సాహిత్యం అందించారు. నకాష్ అజీజ్, రోహిణీ సారోట్ పాడారు. ట్రెండీ అండ్ పెప్పీగా ఉంది. ఒక్కసారి ఆ సాంగ్ లిరిక్స్ చూడండి.
పల్లవి:బార్సీలోన బేబీమార్స్ నుండి మేబీపుట్టుకొచ్చిందోబీచ్ కి కొట్టుకొచ్చిందో
నడుమే స్కార్ లెట్ట్నడకే విన్స్ లెట్ట్ఒళ్లు చూస్తే టేలరు స్విప్టుకళ్ళు రెండు తిరిగేటట్టు
బెల్లా బెల్లా ఇసా బెల్లాబాగున్నావే రసగుల్లాఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లానింపేసావే నిలువెల్లా 2
స్పెయిన్ కే అందాల నిట్టాఅద్దిన ఓ పూల బుట్టావీధుల్లో పోతుంటే అట్టావార్తల్లో రాయాలి చిట్టా
నీ బుగ్గల్లో బాగుందే సొట్టాదానిపై ముగ్గులు పెట్టాబ్యూటీల పోటీల పట్టాపొందినావ ఫారిన్ లో ఎట్టా
పిల్లా పిల్లా ఇసా బెల్లాబాగున్నావే రసగుల్లాఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లానింపేసావే నిలువెల్లా 2
చరణం1 (అతడు)ఐరోపా మ్యాపునే నీ షేపు చూసి గీసుంటారేవైనులోని మత్తునే నీ కళ్లలోంచి తీసుంటారేఈ గ్లోబుకింత వైబునే నీ గ్లామరే తెచ్చి పెట్టిందేగూగులింత కాలమే నీ బొమ్మకై గాలించిందే ఏ బుక్స్ లోన లేనిదేనీ లుక్సులోన ఉన్నదేఏ పెగ్గులోన లేనిదేనీ హగ్గులో భగ్గుమన్నాదే
(ఆమె)అల్బ రినో బేబీనీ అల్లరేదో మేబీపట్టుకొచ్చిందోఇట్టా నెట్టుకొచ్చిందోమాటల్లో క్రేజీ నెస్సుచూపుల్లో ఉంది క్రష్! వేటాడే క్యాట్ ఫిష్షుఇస్తాలే స్పానిష్ కిస్సు
బెల్లో బెల్లో హల్లో బెల్లోసౌండే మారే బ్యాంగిల్లోబెల్లో బెల్లో హల్లో బెల్లోల్యాండై పోదాం ఐల్యాండ్లో
బెల్లో బెల్లో హల్లో బెల్లోజంటై ఉందాం దీవుల్లోబెల్లో బెల్లో హల్లో బెల్లోచిల్లై పోదాం మాపుల్లో
'బెల్లా బెల్లా ఇసా బెల్లా...' పాట / లిరికల్ వీడియో చూస్తే కలర్ ఫుల్ పిక్చరైజేషన్ బావుంది. స్క్రీన్ మీద ఈ సాంగ్ ఇంకా బావుంటుందని అర్థం అవుతోంది. ఇప్పుడీ పాట విడుదలైన కొన్ని క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ట్రెండ్ అవుతోంది.
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకం మీద సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ సినిమా విడుదల కానుంది.