కాకినాడ పోర్టులో NBK111 యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ చేస్తున్న సమయంలో చిత్ర కథానాయకుడు గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి నట సింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు కండరాలు పట్టేశాయి. మజిల్ టియర్ ఏర్పడింది. అందువల్ల, ఆయన మోకాలి సర్జరీ (Balakrishna Knee Surgery) చేయాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో చిత్రీకరణకు విరామం ఇచ్చారు. బాలకృష్ణ హైదరాబాద్ వచ్చారు.
రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు...ఏఐజీ ఆస్పత్రిలో బాలయ్యకు సర్జరీ!బాలకృష్ణకు కండరాలు పట్టేయడంతో హుటాహుటిన కాకినాడ పోర్టు సమీపంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి ఆయన్ను తీసుకు వెళ్ళారు. అక్కడ తాత్కాలికంగా చికిత్స అందించడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. భవిష్యత్తులో మళ్ళీ ఆ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండాలంటే సర్జరీ చేసుకోవడం మంచిదని బాలయ్యకు వైద్యులు సూచించారు. దాంతో వల (జూలై 22, బుధవారం) ఉదయం కాకినాడ నుంచి రాజమండ్రి వచ్చిన బాలకృష్ణ, అక్కడ నుంచి విమానంలో హైదరాబాద్ సిటీకి వచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ సలహా మేరకు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో అత్యవసరంగా హైదరాబాద్ చేరుకున్నారు.
హైదరాబాద్ సిటీలోని గచ్చిబౌలి ఏరియాలో ఉన్న ఏఐజీ ఆసుపత్రి (AIG Hospital) లో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ చేశారు. ఆ తర్వాత గాయం త్వరగా నయం కావడానికి నాలుగు నుంచి ఐదు వారాల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఎన్‌బీకే111 చిత్రీకరణకు నెల బ్రేక్!బాలకృష్ణకు సర్జరీ కావడంతో నెల పాటు ఎన్‌బీకే 111 చిత్రీకరణకు విరామం ఇవ్వాలని చిత్ర బృందం నిర్ణయించినట్టు సమాచారం. సినిమాలో మెజారిటీ సీన్స్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందట. విలన్ రోల్ చేస్తున్న మంచు మనోజ్, బాలకృష్ణ మీద యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న సమయంలో గాయమైంది. సో, ఆ షెడ్యూల్ కంటిన్యూ చేయాలంటే బాలకృష్ణ సెట్స్‌కు రావాలి. అందుకని నెల రోజుల పాటు చిత్రీకరణకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
బాలయ్యకు సర్జరీ కావడంతో ఆయన త్వరగా కోలుకోవాలని నందమూరి ఫ్యాన్స్, ఆడియన్స్, యూనిట్ సభ్యులు ఆకాంక్షిస్తున్నారు. ఆస్పత్రి నుంచి రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్‌బీకే 111 కాకుండా కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ మరొక సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే.
