Mega Fans Vs Balakrishna: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు తెలుగు సినిమా-రాజకీయ పరిశ్రమల్లో తుఫాను సృష్టించాయి. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని 'సైకో' అని పిలవడంతో పాటు, మెగాస్టార్ చిరంజీవి పేరు ఉటంకించడం వల్ల మెగా అభిమానులు కోపానికి గురయ్యారు. కోట్ల మందికి ఆరాధ్యుడిగా ఉన్న వ్యక్తిపై సమయం సందర్భం లేకుండా దుర్భాషలాడిన బాలకృష్ణపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. విషయాన్ని మరింత సీరియస్‌గా తీసుకోవాలని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్‌ భావించింది. అందులో భాగంగా హైదరాబాద్‌లో సమావేశమైంది. 

Continues below advertisement

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో సమావేశమై, తెలుగు రాష్ట్రాల్లోని 300 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నార. సోషల్ మీడియా, ద్వారా విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి సున్నితంగా వాళ్లకు క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. "అలాంటి పనులు చేయొద్దు" అని అభిమానులను హెచ్చరించడంతో, ఈ వివాదం రాజకీయ-సినిమా డైనమిక్స్‌లో మలుపు తిరిగిందని చెప్పవచ్చు. 

సెప్టెంబర్ 25న ఏపీ అసెంబ్లీ సమావేశంలో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ సినిమా పరిశ్రమలోని పెద్దలను ఎలా అవమానించారో వివరిస్తూ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఉదాహరణలు చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవి ప్రస్తావన వచ్చింది. చిరంజీవి ప్రస్తావన తీసుకురావడంతో  హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్‌ను, చిరంజీవి పరుషపదజాలంతో విమర్శలు చేశారు. ఆయన కామెంట్స్ చేసిన కాసేపటికే చిరంజీవి ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. నాడు జగన్ ఆహ్వాం మేరకే తామంతా వెళ్లామని అందుకే బాలకృష్ణ, తన సినిమా టికెట్ ధరలు పెరిగాయని గుర్తు చేశారు.

Continues below advertisement

బాలృష్ణ కామెంట్స్ చేయడం, దానికి వెంటనే చిరు స్పందించంలో ఒక్కసారి తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యాయి. దీంతో గొడవలు మొదలయ్యాయి. బాలకృష్ణ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో, మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #BoycottBalayya హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్‌లు పెట్టడం మొదలుపెట్టారు. ఈ వివాదంపై ఇటు జనసేన, అటు టీడీపీ సైలెంట్‌గా ఉంటూ వచ్చాయి. చివరకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు కూడా స్పందించలేదు. వైసీపీ మాత్రం పవన్, మెగా ఫ్యామిలీని ప్రశ్నిస్తూ వచ్చింది. అసెంబ్లీలో అవమానపరిచిన బాలకృష్ణపై ఎందుకు రియాక్ట్ కావడం లేదని ప్రశ్నించింది. 

చివరకు వివాదం తీవ్రమవుతుందని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. అనారోగ్యం పేరుతో పరామర్శ చేసినప్పటికీ అసలు విషయం చిరంజీవి- బాలకృష్ణ వివాదమే అంటున్నాయి ఇరు పార్టీ వర్గాలు. అసెంబ్లీ కూడా చంద్రబాబు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. టార్గెటెడ్‌గా ఎవరిపై విమర్శలు చేయొద్దన్నారు. అలా చేస్తే మూల్యం చెల్లించుకుంటారని రాష్ట్రం నష్టపోతుందని అన్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలకు మూల కారణమైన కామినేని తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. దీంతో బాలకృష్ణ వ్యాఖ్యలను కూడా రికార్డుల నుంచి తొలగించారు. ఇలా పలు మార్గాల్లో వివాదం పరిష్కరించేందుకు కూటమిలో ప్రయత్నాలు జరగాయి.  

ఇక్కడితో వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ ఇన్ని కామెంట్స్ చేసిన బాలకృష్ణ తన వ్యాఖ్యనలపై ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం, సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్‌ బాలయ్య ఎక్కడైనా ఇలానే మాట్లాడుతారనే ఎలివేషన్స్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. పై స్థాయిలో వివాదం పరిష్కారమైనట్టు కనిపించినా కింది స్థాయిలో మాత్రం వారు ఏదో ఒకటి చేయాలని కసితో ఉన్నారు. అందుకే ప్రత్యేకంగా సమావేశమై కేసులు పెట్టేందుకు ప్లాన్ చేశారు. 

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలో మెగా ఫ్యాన్స్ సమావేశమై, బాలకృష్ణ చేసిన కామెంట్స్‌ను ఖండించారు. తెలుగు రాష్ట్రాల్లోని 300 పోలీస్ స్టేషన్లలో బాలకృష్ణకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో 50 మంది మెగా ఫ్యాన్ లీడర్లు పాల్గొన్నారు. "చిరంజీవిని అవమానించడం సరికాదని" అని తీర్మానం చేశారు. సమాచారం ప్రకారం, 'అవమానకర వ్యాఖ్యలు'సెక్షన్ కింద ఫిర్యాదులు దాఖలు చేయాలని ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ వైరల్ అవ్వడంతో, సోషల్ మీడియాలో #MegaFansVsBalayya ట్రెండింగ్ అయింది. 

విషయం తెలుసుకున్న చిరంజీవి, తన అభిమానులను సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. సెప్టెంబర్ 28న, చిరంజీవి ఫ్యాన్ క్లబ్ లీడర్లతో ఫోన్‌లో మాట్లాడి, "అలాంటి పనులు చేయొద్దు. మన అభిమానులు ఎప్పుడూ శాంతియుతంగా ఉండాలి. రాజకీయ వివాదాల్లో పడకూడదు" అని హితబోధ చేశారని తెలుస్తోంది. చిరంజీవి సూచనతో మెగా ఫ్యాన్స్‌ ఫిర్యాదు ప్లాన్‌ను డ్రాప్ చేశారు.