గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu)లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తున్న 'అఖండ 2 తాండవం' (Akhanda 2 Thaandavam) వాళ్ల కలయికలో నాలుగో సినిమా. దీనికి ముందు 'సింహ', 'లెజెండ్', 'అఖండ' చేశారు. మొత్తం నాలుగు సినిమాలూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. వాట్ నెక్స్ట్? వీళ్ళిద్దరి కలయికలో ఐదో సినిమా ఎప్పుడు వస్తుంది? ఎటువంటి కథతో వస్తుంది? అనేది ప్రస్తుతం చెప్పలేం. కానీ ఆ సినిమా ఎవరు ప్రొడ్యూస్ చేస్తారనే విషయంలో క్లారిటీ ఉందని టాలీవుడ్ అంటోంది.

Continues below advertisement

గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ నిర్మాణంలో...బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల ఐదవ సినిమా!Boyapati Srinu Next Movie After Akhanda 2: బోయపాటి నెక్స్ట్ సినిమా ఏంటి? అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఒక సినిమా నిర్మించనున్నారని టాలీవుడ్ టాక్. 

BB5... అంటే బాలయ్య, బోయపాటిల 5వ సినిమాను గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే అది 'జై అఖండ' అవుతుందా? మరొక సినిమా అవుతుందా? అనేది చూడాలి. ఇటు హీరోతో అటు దర్శకుడితో నిర్మాతకు సత్సంబంధాలు ఉన్నాయి. బాలకృష్ణను ఓటీటీకి‌ తీసుకు వచ్చిన క్రెడిట్ అల్లు అరవింద్ సొంతం. ఆహా ఓటీటీ‌ కోసం 'అన్ స్టాపబుల్' షో చేశారు బాలయ్య. ఇక గీతా ఆర్ట్స్ సంస్థలో అల్లు అర్జున్ హీరోగా సరైనోడు సినిమా చేశారు బోయపాటి. ఇప్పుడు ఈ ముగ్గురి కలయికలో సినిమా రానుంది. 

Continues below advertisement

చిరంజీవి సినిమా కోసం అడ్వాన్స్...బాలకృష్ణ హీరోగా సినిమా రూపొందుతుందా?గీతా ఆర్ట్స్ సంస్థలో బోయపాటి శ్రీను సినిమా ఇప్పటికి కాదు. చాలా రోజుల నుంచి మాటల్లో ఉన్నది. 'ఖైదీ నెంబర్ 150'తో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలని అల్లు అరవింద్ ప్లాన్ చేశారు. అయితే అది సాధ్యపడలేదు. 'అఖండ 2 తాండవం' స్టార్ట్ కావడానికి ముందు బోయపాటి శ్రీనుతో ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నట్లు గీతా ఆర్ట్స్ నుంచి ఒక ప్రకటన వచ్చింది అప్పట్లో 'సరైనోడు 2' స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని ప్రచారం జరిగింది అయితే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు‌. ఇన్నాళ్లకు బోయపాటి శ్రీనుతో, బాలకృష్ణ హీరోగా సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు గీత ఆన్సర్ రెడీ అయింది.

Also Read: Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. అది ఆయన 111వ సినిమా. హిస్టారికల్ వార్ డ్రామాగా రూపొందుతోంది. అది పూర్తి అయ్యాక బోయపాటి గీతా ఆర్ట్స్ సంస్థ సినిమా చేస్తారా? లేదంటే మధ్యలో మరొకటి చేస్తారా? అనేది చూడాలి.

Also ReadThe Raja Saab BO Prediction: హిందీలో 'రాజా సాబ్' క్రేజ్ ఎలాగుంది? అక్కడ ప్రభాస్ హారర్ కామెడీ ఫస్ట్‌ డే ఎంత కలెక్ట్‌ చేయవచ్చు?