Bad Newz Movie OTT Streaming Update : ఈ మ‌ధ్య కాలంలో చాలా సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతున్న‌ప్ప‌టికీ ఓటీటీల్లో వ‌స్తే చూద్దాంలే అని వెయిట్ చేస్తున్నారు చాలామంది. హిట్ సినిమా అయినా టైం లేక‌పోవ‌డమో, కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల్లో థియేట‌ర్ల‌లో చూడ‌లేక‌పోతున్నారు. న‌చ్చిన సినిమా ఓటీటీలో మ‌ళ్లీ చూడొచ్చు అనుకుంటున్నారు చాలామంది. ఇక అలాంటి సినిమాల్లో ఒక‌టి విక్కీ కౌశ‌ల్, తృప్తి దిమ్రీ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన బాలీవుడ్ సినిమా 'Bad Newz'. ఈ సినిమాని ఓటీటీలో చూసేందుకు చాలామంది ప్లాన్స్ చేసుకున్నారు. అయితే ఆ రోజు రానే వ‌చ్చింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. కానీ, ఇక్క‌డే ఉంది అస‌లు ట్విస్ట్. స‌బ్ స్క్రిప్ష‌న్ ఉన్నా ఈ సినిమాని చూడ‌లేరు ఎందుకంటే? 


స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. 


'Bad Newz' సినిమా హిందీ వెర్ష‌న్ ఇప్ప‌టికే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, అంద‌రూ ఈ సినిమాని చూడ‌లేరు. సినిమా చూడాలంటే క‌చ్చితంగా అద‌నంగా డ‌బ్బులు క‌ట్టాల్సిందే. Bad Newz సినిమా చూడాల‌నుకునే వాళ్లు రూ.349 రెంట‌ల్ ఫీజ్ క‌ట్టి మరి సినిమా చూడాల్సిందే. అమెజాన్ ప్రైమ్ స‌బ్ స్క్రిప్ష‌న్ ఉన్న‌ప్ప‌టికీ డ‌బ్బులు క‌ట్టి మ‌రీ చూడాలి. ఈ సినిమా ఫ్రీ స్ట్రిమింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందో మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. రెంట‌ల్ బేసిస్ లో స్ట్రీమ్ అవుతున్న సినిమాలు చాలా రోజుల త‌ర్వాత కానీ ఫ్రీగా అందుబాటులోకి రావు. దీంతో ఈ సినిమా కోసం ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. 


కామెడీ జోన‌ర్ లో సినిమా.. 


'గుడ్ న్యూస్' అనే స్పిరిచ్యుయ‌ల్ సీక్వెన్స్ గా 'Bad Newz' తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ ఆనంద్. ఈ సినిమా కామెడీ జోన‌ర్ లో తీశారు. నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాని తెర‌కెక్కించారు. సినిమాలో క‌వ‌ల‌ల‌కు అమ్మ ఒక‌టే, ఇద్ద‌రు తండ్రులు అనే కాన్సెప్ట్ తో తీశారు. కొత్త కాన్సెప్ట్ కావ‌డంతో జ‌నాలు సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. క‌థ విష‌యానికొస్తే.. త్రిప్తి దిమ్రీ ఇద్ద‌రు హీరోల‌తో శారీర‌క సంబంధం క‌లిగి ఉంటుంది. ఆమెకు ప్రెగ్నెసీ వ‌స్తుంది. ట్వీన్స్ ఉంటార‌ని చెప్తారు డాక్ట‌ర్లు. అయితే, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు? అనే అనుమానం ఆమెలో తలెత్తుతుంది. ఈ నేపథ్యంలోనే పెటర్నిటీ పరీక్షలు చేస్తారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది. ఈ పరీక్షల్లో ఇద్దరూ ఆ బిడ్డలకు తండ్రులేనని తేలుతుంది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఏం చేస్తుంది? ఎవరిని వదిలేస్తుంది? ఎవరితో రిలేషన్ షిప్ కొనసాగిస్తుంది అనేది సినిమాలో చూడాలి.   


ఇక ఈ సినిమాలో విక్కీ కౌశ‌ల్, తృప్తి దిమ్రీ, ఆమీ వ్రిక్, నేహా దుపియా ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. అమ్రిత్ పాల్ సింగ్ బిందార్, అపూర్వ మెహత‌, క‌ర‌ణ్ జోహార్ ప్రొడ్యూస‌ర్లు. ఈ సినిమాలోని ‘‘తోబా తోబా’’  పాట విప‌రీత‌మైన ఫేమ‌స్ అయ్యింద‌. యూట్యూబ్, ఇన్ స్టా, ట్విట్ట‌ర్ లో పాట బాగా ట్రెండ్ అయ్యింది. పాపుల‌ర్ పంజాబి పాప్ సింగ‌ర్ క‌ర‌న్ అజుల్హానే రాసి, కంపోజ్ చేసి పాడారు తోబా తోబా పాట‌ను. చాలా త‌క్కువ టైంలో ఎన్నో కోట్ల మంది ఈ పాట‌కు ఫ్యాన్స్ అయిపోయారు. ఇక ఈ పాట‌కి బాస్కో మార్టిస్ కొరియోగ్ర‌ఫి చేశారు. ఈ పాటకి విక్కీ, తృప్తి ధిమ్రీ ఇద్ద‌రు కాలు క‌దిపారు.


Also Read: త‌మిళ‌నాడుకూ వ్యాపించిన కేర‌ళ #MeToo మంట‌లు.. సీనియ‌ర్ నటి కుట్టి ప‌ద్మిని సంచ‌ల‌న కామెంట్స్