Babu Mohan : టాలీవుడ్ సీనియర్ కమెడియన్, యాక్టర్ బాబు మోహన్.. నటులు బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావులపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఓ దశలో నేను సినిమాలో ఉంటే బ్రహ్మీ, కోట నటించమని చెప్పారట. అది ఎందుకయ్యిందో, అసలు ఆ విషయం నిజమో, అబద్దమో తెలియదు. కానీ డైరెక్టర్లు మాత్రం నన్ను సినిమాల్లో ఎలాగైనా పెట్టుకుంటామని చెప్పారని తెలిసింది. కాకపోతే మీతో అతని ఉండకుండా చూసుకుంటామని చెప్పారట. మళ్లీ దాసరి, రాజేంద్ర ప్రసాద్ కాంప్రమైజ్ చేసి, ముగ్గురూ కలిసి చేయాల్సిందేనని ఒప్పించి నటించేలా చేశారు. కానీ తనకు మాత్రం వారితో నటించడంలో ఎలాంటి అభ్యంతరం గానీ, ఇబ్బంది గానీ లేదు. నాకెవరూ శత్రువులూ లేరు. ఎవరితోనూ నటించడానికి వ్యతిరేకించలేదు’’ అని అన్నారు.


టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ కాంబినేషన్‌కు తిరుగులేదు. వీళ్లిద్దరూ కలిసి తెరపై కనిపిస్తే ఆడియెన్స్‌కు ఎక్కడలేని హుషారు వస్తుంది. వీరిద్దరూ కలిసి వెండితెరపై తొలిసారి  బి.గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘బొబ్బిలి రాజా’సినిమాలో జోడిగా నటించారు. ఈ సినిమాతోనే వీరి కాంబినేషన్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత వీళ్లు ఎక్కువగా ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకుల చిత్రాల్లో ఎక్కువగా కలిసి నటించారు. కెరీర్ ప్రారంభంలో ‘అహనా పెళ్లంట’ సినిమాలోనూ వీరు నటించినా.. కోట శ్రీనివాసరావుతో, బాబు మోహన్ కు కాంబినేషన్ సీన్స్ లేవు. వీళ్లిద్దరి ఆటో టైమింగ్, పంచెస్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గానే అనిపిస్తాయి. ఇప్పటికీ అంతే ఫ్రెష్ కామెడీనే అందిస్తాయి.


కోట, బాబు మోహన్ కొన్ని సినిమాల్లో తండ్రి కొడుకులుగా, అన్నదమ్ములుగా.. స్నేహితులుగా నటించారు. ముఖ్యంగా కోట బాస్‌గా నటిస్తే.. అతని అసిస్టెంట్‌గా బాబు మోహన్ ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ ఆహ్వానం సినిమాలో మాత్రం కోట శ్రీనివాస రావు .. బాబు మోహన్ అబ్బాయి పాత్రలో నటించడం విశేషం. చివరగా బాబు మోహన్ గత సార్వత్రిక ఎన్నికల ముందు  కోట శ్రీనివాస రావు ప్రాతినిధ్యం వహించిన బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోట శ్రీనివాసరావు, బాబు మోహన్‌ ఇద్దరూ సినిమాలు చేయడం తగ్గించేశారు. వారికి తగ్గ పాత్రలు వస్తే తప్ప ఎక్కడో కనిపిస్తున్నారు.


వీరిద్దరూ కలిసి దాదాపు 60కి పైగా సినిమాల్లో నటించి ఎనలేని పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో బాబు మోహన్, కోట శ్రీనివాసరావు.. ఒకరు లేకుండా ఇంకొకరు లేనిదే సినిమా ఉండేదే కాదంటే అతిశయోక్తి కాదు. అలా మొత్తంగా వీరిద్దరి జోడీ సినీ ఇండస్ట్రీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోయింది. ఇక వీళ్లిద్దరి కుమారులు కూడా యాదృచ్ఛికంగా  యాక్సిడెంట్‌లో కన్నుమూయడం విషాదకరం.


ఇక బాబు మోహన్ విషయానికొస్తే ప్రభుత్వ రెవిన్యూ విభాగంలో వచ్చిన ఉద్యోగాన్ని సైతం వదులుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 'రాజేంద్రుడు గజేంద్రుడు', 'పెదరాయుడు', 'జంబలకిడి పంబ' లాంటి సినిమాలలో మంచి హాస్య పాత్రలు ధరించిన ఆయన.. మాయలోడు, సినిమాతో స్టార్ కామెడియన్ అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా ఎన్నికై మంత్రిగానూ పనిచేశారు. 2004, 2014 లో టీఆర్ఎస్ తరపున ఎన్నికల్లో పాల్గొన్న ఆయన.. 2019లో బీజేపీ చేరి ఎమ్మెల్యే గా పోటి చేసి ఓడిపోయారు.