Avatar First And Ash Budget And Other Details: లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ కొత్త సినిమా 'అవతార్: ఫైర్ అండ్ యాష్' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండియాలో డిసెంబర్ 18న పెయిడ్ ప్రీమియర్లతో విడుదలైందీ సినిమా. కామెరూన్ తన కెమెరాతో తెరపై అద్భుతమైన కథలను సృష్టించే కొద్దిమంది దర్శకులలో ఒకరు. ప్రేక్షకులను పూర్తిగా తెరపై ప్రపంచంలోకి తీసుకెళ్లేలా చేస్తారు. ఆయన 'అవతార్' సినిమా సిరీస్ భారతీయ, అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు మూడో భాగం 'అవతార్: ఫైర్ అండ్ యాష్' విడుదల కానుంది. ఈ హాలీవుడ్ సినిమా గురించి పూర్తి వివరాలు తెలుకోండి.
ఇండియాలో 'అవతార్: ఫైర్ అండ్ యాష్' రిలీజ్ ఎప్పుడు?'అవతార్: ఫైర్ అండ్ యాష్' డిసెంబర్ 19, 2025న భారతీయ థియేటర్లలో విడుదల అయ్యింది. గతంలో విజయవంతమైన 'అవతార్' (2009), 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (2022) చిత్రాలకు సీక్వెల్ ఇది. ఇంతకు ముందు వచ్చిన చిత్రాల మాదిరిగా, 'అవతార్: ఫైర్ అండ్ యాష్' కూడా భారతదేశంలో IMAX, 3D, ప్రీమియం లార్జ్ స్క్రీన్‌లతో సహా అనేక ఫార్మాట్లలో విడుదల అవుతోంది..
'అవతార్: ఫైర్ అండ్ యాష్' దేని గురించి?సినిమా వివరాలు ఇంకా రహస్యంగా ఉంచినప్పటికీ... 'అవతార్: ఫైర్ అండ్ యాష్' పాండోరా ప్రపంచం గురించి మరిన్ని వివరాలను అందిస్తుందని అంచనా. ఈసారి అగ్నితో సంబంధం ఉన్న ఒక కొత్త నావి తెగను పరిచయం చేయనున్నారు. 'ది ది వే ఆఫ్ వాటర్'లో చూపించిన మెట్కాయినా సముద్ర నివాస నావిల కంటే భిన్నంగా ఉంటుంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ గతంలో చెప్పిన వివరాలతో మూడవ చిత్రంలో భావోద్వేగపరంగా మరింత డార్క్ థీమ్ ఉంటుందని అంచనా.
'అవతార్: ఫైర్ అండ్ యాష్'లో జేక్ సుల్లీ, నెయతిరి ప్రధాన పాత్రలలో నటించారు. మనుషులు, నావిలు... రెండు వర్గాలతోనూ వాళ్ళు సవాళ్లను ఎదుర్కొంటారు. అలాగే, జేమ్స్ కామెరూన్ ఈసారి స్పష్టమైన హీరో, విలన్ క్యారెక్టర్లు అనే ఆలోచనలను సవాలు చేస్తారని, పాండోరాను ఊహించని కోణంలో చూపిస్తారని టాక్.
'అవతార్ 3' సినిమాలో ఎవరెవరు ఉన్నారు?'అవతార్ 3'లోనూ ఇంతకు ముందు సినిమాల్లో ఉన్న చాలా మంది ప్రధాన తారాగణం మళ్లీ ఇందులో నటించారు. వీరిలో సామ్ వర్తింగ్టన్ (జేక్ సుల్లీ), జో సల్దానా (నెయతిరి), సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్లెట్, క్లిఫ్ కర్టిస్, బ్రిటన్ డాల్టన్, జేమీ ఫ్లేటర్స్, ట్రినిటీ బ్లిస్, బెయిలీ బాస్ ఉన్నారు.
'అవతార్ ఫైర్ అండ్ యాష్' బడ్జెట్ ఎంత?'అవతార్: ఫైర్ అండ్ యాష్' బడ్జెట్‌ను అధికారికంగా ప్రకటించలేదు. అయితే, హాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం... గ్లోబల్ మార్కెటింగ్ ఖర్చులను మినహాయించి ఈ ఫ్రాంచైజీలోని ప్రతి సినిమా నిర్మాణ వ్యయం సుమారు 250 - 300 మిలియన్ డాలర్లుగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేశారట. అండర్ వాటర్ సీన్స్, పెర్ఫార్మెన్స్ - క్యాప్చర్ సీక్వెన్స్‌లను పరిగణనలోకి తీసుకుంటే... ఫైర్ అండ్ యాష్ ఇప్పటి వరకు వచ్చని సినిమాల్లో భారీ బడ్జెట్ సినిమాలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.