Ashu Reddy Instagram Subscription Followers: బుల్లితెర మీద ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి కేసులో రోజుకు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తన నుంచి తొమ్మిది కోట్లు కాజేసిందని ఎన్నారై వెంకీ అలియాస్ ధర్మేంద్ర కేసు పెట్టారు. ఆ తర్వాత అషురెడ్డి కోటిన్నర వెనక్కి తిరిగి ఇస్తానని, మిగతా డబ్బులు ఉన్నప్పుడు ఇస్తానని చెప్పిన ఆడియో లీక్ అయ్యింది. కేసు సంగతి పక్కన పెడితే... ఈ వివాదం వల్ల ఆమెకు ఓ లాభం చేకూరింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటున్న నెటిజనుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

Continues below advertisement

వారంలో మూడు వేల సబ్‌స్క్రైబర్లుఏప్రిల్ 22న అషు రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ స్టార్ట్ చేసినట్టు తెలిపారు. ఓ వీడియోలో సబ్‌స్క్రిప్షన్ మీద సరదాగా కామెంట్ చేశారు కూడా. అప్పటికి ఆమెను సబ్‌స్క్రైబ్ అయిన నెటిజనుల సంఖ్య మినిమమ్ 30 మంది కూడా లేరు. కట్ చేస్తే... తర్వాత వెడ్డింగ్ ఫ్రాడ్ కేసు వచ్చింది.

Also Read: Ashu Reddy Audio Leaked: టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా - సెటిల్‌మెంట్‌కు ప్రయత్నిస్తూ అషు రెడ్డి వార్నింగ్ - ఆడియో లీక్

Continues below advertisement

తొమ్మిది కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వమని ధర్మేంద్ర డిమాండ్ చేస్తున్నారు. ఆ అమౌంట్ పెద్దది. దానితో కంపేర్ చేస్తే... ఇన్‌స్టా ద్వారా అషు రెడ్డికి వచ్చేది తక్కువ. కానీ, గుడ్డిలో మెల్ల అన్నట్టు ఇన్‌స్టా సబ్‌స్క్రైబర్లు పెరిగే విషయంలో ఈ వివాదం ఆమెకు కొంత హెల్ప్ చేసిందని చెప్పాలి. కేసు నేపథ్యంలో ఆమె ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌కు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మూడు వేల మంది సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారు. పది లక్షల రూపాయలకు పైగా ఆమె సబ్‌స్క్రిప్షన్ కోసం నెటిజనులు ఖర్చు చేశారు.

Also Read: Surekha Vani Birthday - సురేఖా వాణి బర్త్ డే... ఇంట్లో స్పెషల్‌గా సెలబ్రేట్ చేసిన కూతురు సుప్రీతా నాయుడు

అషు రెడ్డి పోస్ట్ చేసిందీ ఏమీ లేదు!ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌లో అషు రెడ్డి పెద్దగా పోస్ట్ చేసింది కూడా ఏమీ లేదు. ఓ మూడు రీల్స్, తొమ్మిది స్టోరీలు మాత్రమే షేర్ చేశారు. ఆల్రెడీ వాటికి మూడు వేల మంది వచ్చారు. పోస్టుల సంఖ్య పెరిగితే ఇంకెంత మంది వస్తారో? ఇంతకు ముందు విష్ణుప్రియ భీమనేని విషయంలోనూ ఇదే విధంగా జరిగింది. కేసు వచ్చిన తర్వాత ఆమె సబ్‌స్క్రిప్షన్ డిమాండ్ పెరిగి, ఐదు వందల నుంచి ఏకంగా దగ్గర దగ్గర తొమ్మిది వేలకు వచ్చింది.

Also ReadSalman Khan Farmhouse Party - సల్మాన్ ఖాన్ పార్టీల్లో ఏం జరుగుతుంది? అసలు విషయం బయట పెట్టిన అమీషా పటేల్