AS Ravi Kumar Chowdary : విలన్‌ను హీరో చేస్తే బలిసింది - గోపీచంద్‌పై దర్శకుడి ఫైర్

గోపీచంద్ (Hero Gopichand)ను ఉద్దేశించి దర్శకుడు ఎఎస్ రవికుమార్ చౌదరి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఘాటుగా విమర్శలు చేశారు.

Continues below advertisement

గోపీచంద్ (Gopichand) కథానాయకుడిగా దర్శకుడు ఎఎస్ రవికుమార్ చౌదరి (AS Ravi Kumar Chowdary) రెండు సినిమాలు తీశారు. అందులో 'యజ్ఞం' సంచలన విజయం సాధించింది. హీరోగా గోపీచంద్ మొదటి సక్సెస్ అది. అయితే... ఆ తర్వాత వచ్చిన కొన్నాళ్ళకు గోపీచంద్, ఎఎస్ రవికుమార్ చౌదరి కలిసి చేసిన 'సౌఖ్యం' పరాజయం పాలైంది. 

Continues below advertisement

జయాపజయాలతో సంబంధం లేకుండా గోపీచంద్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన ప్రయాణంలో కొన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి. అయితే... ఫ్లాప్స్ పర్సెంటేజ్ కంటే హిట్స్ ఎక్కువ. మరోవైపు ఎఎస్ రవికుమార్ చౌదరి కెరీర్ చూస్తే... 'యజ్ఞం', ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా తీసిన 'పిల్లా నువ్వు లేని జీవితం' మినహా మరో విజయం లేదు. కొంత విరామం తర్వాత 'తిరగబడర సామీ' (thiragabadara saamy movie) చిత్రానికి ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. ఇటీవల టీజర్ విడుదలైంది. ఆ కార్యక్రమంలో మన్నారా చోప్రాకు ఆయన ముద్దు పెట్టడం వైరల్ అయిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత సినిమా తీసిన ఆయన... ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోలు గోపీచంద్, సాయి ధరమ్ తేజ్ - ఇద్దరిపై పరోక్షంగా విమర్శలు చేశారు. 

హీరోలను చూస్తే విసుగు వచ్చేసింది!
రవికుమార్ చౌదరికి నట సింహం నందమూరి బాలకృష్ణ అంటే అభిమానం. అది 'తిరగబడర సామీ' ప్రచార చిత్రాల్లో కూడా కనిపించింది. బాలకృష్ణతో రవికుమార్ చౌదరి తీసిన 'వీరభద్ర' ఫ్లాప్ అయ్యింది. అయితే... ఆయనతో మళ్ళీ తప్పకుండా సినిమా చేస్తానని పేర్కొన్నారు. అయితే, తాను హిట్స్ ఇచ్చిన ఇద్దరు హీరోలను చూస్తే విసుగు వచ్చిందని తెలిపారు. 

''ఇద్దరు హీరోలను చూసి విసుగు వచ్చింది. ఇంతకు ముందు చెట్టు కింద కూర్చొని అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. ఇప్పుడు క్యారవాన్‌లు! ఇప్పుడు 'రవికుమార్ చౌదరి వచ్చాడు' అని చెబితే... 'కాసేపు వెయిట్ చేయమను' అనే స్థాయికి వాళ్ళు వచ్చారు. అది తప్పు'' అని రవికుమార్ చౌదరి విరుచుకుపడ్డారు. 'ఒరేయ్! అంత బలిసిపోయిందా మీకు'! అంటూ కెమెరా వైపు చూస్తూ హీరోపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ హీరో తన ఇంటికి, పుట్టినరోజు పార్టీకి, పెళ్లికి వచ్చాడని... ఇప్పుడు తాను ఆ హీరో దగ్గరకు వెళ్లాలంటే ఐదారుగురిని దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఎఎస్ రవికుమార్ చౌదరి విరుచుకుపడ్డారు.

Also Read నితిన్ జోడీగా 'కాంతార' కథానాయిక సప్తమి, కీలక పాత్రలో లయ కూడా - ఏ సినిమాలోనో తెలుసా?

గోపీచంద్ మీద పరోక్షంగా విమర్శలుఎఎస్ రవికుమార్ చౌదరి ఇంటర్వ్యూ చూస్తే... గోపీచంద్ మీద ఆయన పరోక్షంగా విమర్శలు చేశారని సులభంగా అర్థం అవుతోంది. విలన్ రోల్స్ చేస్తున్న వాడిని తాను హీరో చేశానని చెప్పడంలో ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారో ఈజీగా అర్థమైంది. తన కంటే రెమ్యూనరేషన్ తక్కువ తీసుకున్న హీరోకి ఇప్పుడు బలుపు పెరిగిందని పరుష పదజాలంతో మాట్లాడారు.

బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ రియల్ హీరోలు  
ముఖం మీద మేకప్ వేసుకున్న తర్వాత చాలా మంది మేక చేష్టలు చేస్తారని ఎఎస్ రవి కుమార్ చౌదరి వ్యాఖ్యానించారు. ఒక్క పవన్ కళ్యాణ్, ఒక బాలకృష్ణ రియల్ హీరోలు అని ఆయన అన్నారు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ అదే విధంగా ఉన్నారని... తనతో పని చేసిన ఇద్దరు హీరోలు తర్వాత మారిపోయారని వ్యాఖ్యానించారు. తనది కోపం కాదని... ఆవేదన, ఆక్రోశం, ఆలోచన అని రవికుమార్ చౌదరి తెలిపారు.

చిరంజీవి కంటే వీళ్ళు గొప్పవాళ్ళా?
చిరంజీవి కంటే వీళ్ళు గొప్పవాళ్ళా? అని ఎఎస్ రవికుమార్ చౌదరి ప్రశ్నించారు. ఆయన ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంటారని, వీళ్ళు అలా ఉండరని ఆయన చెప్పారు. బాలకృష్ణ చూడని జీవితమా వీళ్ళది? అంటూ రవికుమార్ చౌదరి విరుచుకుని పడ్డారు.

Also Read 'స్కంద' రిలీజ్‌కు ముందు సెంచరీ కొట్టిన రామ్ - రేర్ రికార్డ్ బాసూ!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement