Arun Govil: ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా పై ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ మూవీలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ మూలో గ్రాఫిక్స్ వర్క్స్ బాలేదు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు మూవీలో క్యారెక్టర్స్ లుక్స్, డైలాగ్స్ పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ‘ఆదిపురుష్’ మూవీపై టీవీ రామాయణ్ సీరియల్ లో రాముడి పాత్ర చేసిన అరుణ్ గోవిల్ స్పందించారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


మా రామాయణంలో ఇలా లేదు: అరుణ్ గోవిల్


ఇటీవల ‘ఆదిపురుష్’ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు అరుణ్ గోవిల్. తాను సినిమాను చూడలేదని, కానీ సినిమాలో చాలా వివాదాస్పదమైన ఉన్నట్లు తాను విన్నానని అన్నారు. ముఖ్యంగా హనుమంతుడి డైలాగ్స్ వివాదాస్పదంగా ఉన్నాయని చెప్పారు. హనుమంతుడిని అందరూ దేవుడిలా పూజిస్తామని, కానీ సినిమాలో దేవుడు ఇలాంటి భాష మాట్లాడం సరికాదన్నారు. సినిమాలో అలా చూపిస్తారని తాను అసలు ఊహించలేదన్నారు. అయినా హనుమంతుడి పాత్ర డైలాగ్ ల గురించి ఆ మూవీ రైటర్ మనోజ్ ముంతాషిర్ చేసిన ట్వీట్ ను తాను చూశానని, అయితే ఇప్పుడాయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానడటం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. సీతారాములు దేవుళ్లని.. వాళ్లని తామంతా పూజిస్తామని అన్నారు. ఏదేమైనా సినిమాలో దేవుళ్లను అలా చూపించకుండా ఉండాల్సిందన్నారు. తాము నటించిన రామాయణంలో ప్రతీ డైలాగ్ చాలా బాగుంటుందని చెప్పారు.


రాముడిగా ప్రభాస్ బాగానే చేశాడు, కానీ..


అరుణ్ గోవిల్ ఆ ఇంటర్వ్యూలో రాముడి పాత్ర గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ ఇమేజ్ దేవుడి పాత్రలకు సరిపోదని అతనిది స్టార్ ఇమేజ్ అని అన్నారు. కానీ రాముడి పాత్రలో ప్రభాస్ చాలా బాగా నటించాడని చెప్పారు. అలాగే మిగతా నటులు కూడా బాగానే చేశారని, కానీ మేకర్స్ వారి గెటప్స్, లుక్స్ పై ఇంకాస్త శ్రద్ద పెట్టుండాల్సిందని చెప్పుకొచ్చారు. సినిమాను ఎంత ప్రభావవంతంగా తీసినా చూపించే విధానంలో లోపం ఉంటే అది చాలా సమస్యలను తీసుకొస్తుందని అన్నారు. ‘ఆదిపురుష్’ విషయంలో కూడా అదే జరిగిందని అన్నారు. ఈ మూవీలో లుక్స్ చాలా పూర్ గా ఉన్నాయని చెప్పారు. 


ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీను దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. భారతదేశంలో ఇప్పటి వరకూ నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ మూవీ విడుదలైన దగ్గర నుంచీ విమర్శలు వస్తున్నా వసూళ్లు మాత్ర బానే వస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా సినిమా బడ్జెట్ కు సరిపడా వసూళ్లు వచ్చేసాయని టాక్ నడుస్తోంది. ఇంకా మూవీ థియేటర్లలో సక్సెస్ఫుల్ గానే రన్ అవుతోంది. మరి ఈ మూవీ మున్ముందు ఇంకెన్ని వసూళ్లు రాబడుతుందో చూడాలి. ఈ చిత్రంలో ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సన్నీ సింగ్, దేవదత్తా నాగే, వత్సల్ శేత్ తో పాటు ఇతర నటీనటులు కనిపించారు. 


Also Read: నిఖిల్ 'స్పై'లో దగ్గుబాటి హీరో? ఏ పాత్రలో అంటే?