నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. హీరో తల్లిగా, వైజయంతి పాత్రలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుంది. దీనికి అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. సెన్సార్ పూర్తి కావడంతో సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. అది ఎలా ఉందంటే?

కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ హిట్ లోడింగ్!Arjun Son Of Vyjayanthi censor report: నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త పాయింట్ తీసుకుని చేసిన ప్రతి కమర్షియల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 'అతనొక్కడే', 'పటాస్', 'బింబిసార'... కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఆయన సినిమా చేసిన ప్రతిసారీ మంచి విజయం అందుకున్నారు. ఈసారి కూడా కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ సినిమా లోడింగ్ అని సెన్సార్ నుంచి రిపోర్ట్స్ అందుతున్నాయి. 

Arjun Son Of Vyjayanthi Runtime: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'కి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ లభించింది. మూవీ చూసిన సెన్సార్ టీమ్ రీసెంట్ టైమ్స్‌లో ఇంత పవర్ ప్యాక్డ్ ఎమోషనల్ కమర్షియల్ ఎంటర్టైనర్ చూడలేదని కాంప్లిమెంట్స్ ఇచ్చారట. 

మదర్ అండ్ సన్ సీన్స్ సూపర్బ్...క్లైమాక్స్ ట్విస్ట్, ఎమోషన్స్ నెక్స్ట్ లెవల్!Arjun Son Of Vyjayanthi Highlights: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'లో ఫస్ట్ హైలైట్ నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి నటన అని... వాళ్లిద్దరి నటన వల్ల మదర్ అండ్ సన్ సెంటిమెంట్ సీన్స్ అన్నీ బాగా వచ్చాయని సినిమా చూసిన జనాలు చెబుతున్నారు.

Also Read: శివ నామ స్మరణ కాదు... శవ నామ స్మరణేనా... ఒళ్ళు జలదరించేలా తమన్నా 'ఓదెల 2' ట్రైలర్... థియేటర్లలో పూనకాలే

పోలీస్ అధికారిగా విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించని తల్లిగా విజయశాంతి, బాధ్యతాయుతమైన కొడుకుగా కళ్యాణ్ రామ్ తమ తమ పాత్రల్లో అదరగొడితే... ఈ ఇద్దరి మధ్య కాన్‌ఫ్లిక్ట్‌ ఎందుకు వచ్చిందనేది ఆసక్తికరంగా ఉంటుందట. మదర్ అండ్ సన్ సెంటిమెంట్ సీన్స్ కొత్తగా ఉండటమే కాదు, ఆ ఎమోషనల్ సీన్స్ అన్నీ బాగా వచ్చాయని... దర్శకుడు ప్రదీప్ చిలుకూరి కథను చాలా గ్రిప్పింగ్‌గా తీశారని తెలిసింది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అని అంటున్నారు. సినిమా చివరలో ఆడియన్స్ అందరూ షాక్ అయ్యే సర్‌ప్రైజ్‌ రివీల్ చేశారట. ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నత స్థాయిలో ఉన్నాయని, సంగీతం కూడా బావుందని తెలిసింది. మొత్తం మీద కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ హిట్ లోడింగ్ అని అంటున్నారు. పర్ఫెక్ట్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' అని ఎర్లీ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Also Readఆల్మోస్ట్ ఏడాది తర్వాత ఓటీటీలోకి అషు రెడ్డి సినిమా... తెలుగు థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతోందంటే?

'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ప్రీ రిలీజ్ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీ వీరాజ్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కథనం: శ్రీకాంత్ విస్సా, కళా దర్శకత్వం: బ్రహ్మ కడలి, యాక్షన్: రామకృష్ణ - పీటర్ హెయిన్, కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: రామ్ ప్రసాద్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా - సునీల్ బలుసు, నిర్మాణ సంస్థలు: అశోక క్రియేషన్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్, సమర్పణ: ముప్పా, రచన - దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి.