Ari Movie Vinod VArma First Look: అనసూయ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న సినిమా ‘అరి’. 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనే ట్యాగ్ లైన్‌తో వస్తోంది ఈ సినిమా. ఈ మూవీకి సంబంధించి రిలీజైన పోస్టర్లు, ట్రైలర్‌, సాంగ్స్‌ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్‌ క్యారెక్టర్‌ అయిన వినోద్ వర్మ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.'పేపర్ బాయ్' సినిమాతో దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 


ఇంట్రెస్టింగ్‌గా ఫస్ట్‌ లుక్‌


‘అరి’ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల్లో సినిమాపై ఇంట్రెస్ట్‌ను కూడా పెంచేశాయి. ఇక ఈరోజు రిలీజైన వినోద్ వర్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంటోంది. ఓ పెద్ద లైబ్రరీలో ఇంపార్టెంట్ విషయాలు నోట్ చేసుకుంటున్న వినోద్ వర్మ స్టిల్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, త్వరలోనే రిలీజ్‌ అవుతుందని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో ఒక నిర్మాణ సంస్థ భాగస్వామి కానుందని, త్వరలోనే థియేటర్లలో రిలీజ్ చేస్తామని చెప్పారు మేకర్స్‌. 


ఆర్ వీ రెడ్డి సమర్పణలో 'ఆర్వీ' సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి సంయుక్తంగా ‘అరి’ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంలో అనసూయ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘అరి’ సినిమాకి అనుప్ రూబెన్స్‌ సంగీతం అందించారు. ఎడిటర్ జి. అవినాష్, లిరిక్స్ కాసర్ల శ్యాం, వనమాలి, కళ్యాణ్ చక్రవర్తి, కొరియోగ్రఫీ - భాను, జీతు, సినిమాటోగ్రఫీ కృష్ణ ప్రసాద్ అందిస్తున్నారు.


రైట్స్ కోసం పోటీ.. 


సినిమా చిన్నదైనా, పెద్దదైనా బాగుంటే.. రీ మేక్‌ రైట్స్‌ కోసం ఎగబడతారు. అలా ‘అరి’ సినిమా రైట్స్‌ కోసం బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు కోలీవుడ్ స్టార్ హీరోలో ఒకరు కూడా ఈ రైట్స్ కోసం రేసులో ఉన్నారట. ఈ మూవీ ట్రైలర్ విడుదల అయినప్పటి నుండే ‘అరి’ రీమేక్ రైట్స్ కోసం ఎదురుచూడడం మొదలుపెట్టాడు అభిషేక్. కోలీవుడ్, బాలీవుడ్ సైతం ఎగబడుతున్న ఈ మూవీ ఎలా ఉంటుందా అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షడ్రుచులు, అరిషడ్వర్గాలు అనే కొత్త రకం కాన్సెప్ట్‌తో 'అరి' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మనుషుల్లో ఉండే లోతైన కోరికలను తీర్చే పాత్రలో వినోద్ వర్మ కనిపించనున్నాడు. ఇక కోరికలు తీరాలి అనుకునేవారు ఒక్కొక్కరుగా వచ్చి తనకు చెప్పుకుంటారు. అదే సమయంలో వారందరి చేత నేరాలకు పాల్పడేలా చేస్తాడు వినోద్ వర్మ. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలా మలుపులు తిరుగుతాయి అనేది మిగిలిన కథ. 


Also Read: పెళ్లయిన ఆరేళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన దీపికా పదుకొనే - డ్యూ డేట్ కూడా చెప్పేసిన బ్యూటీ