Ari Movie Director Jayashankarr Journey: 'పేపర్ బాయ్' గుర్తుందా? సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా. ఏడేళ్ళ క్రితం థియేటర్లలోకి వచ్చింది. దానికి జయశంకర్ దర్శకుడు. మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. 'పేపర్ బాయ్' తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా 'అరి'. అక్టోబర్ 10న థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. మరి ఈ సినిమా కోసం ఆయన ఎందుకు అంత సమయం తీసుకున్నారు? ఏడేళ్ళు ఎందుకు గ్యాప్ వచ్చింది? అంటే...
మైథలాజికల్ టచ్... గురూజీలతో చర్చలు!'అరి' (My Name Is Nobody) అనేది సినిమా టైటిల్. 'అరి' అంటే శత్రువు అని అర్థం. అరిషడ్వర్గాలలో మెదటి రెండు పదాలు 'అరి'ని తీసుకుని సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ వరకు మాత్రమే కాదు... సినిమా కథ, కథాంశంలోనూ మైథలాజికల్ టచ్ ఉంటుంది.
వెండితెరపై ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయనటువంటి, రానటువంటి కాన్సెప్ట్‌తో 'అరి' చిత్రాన్ని తెరకెక్కించినట్టు జయశంకర్ వివరించారు. కథ కోసం పడిన శ్రమ గురించి ఆయన మాట్లాడుతూ... ''అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌కు మైథలాజికల్ టచ్ ఇస్తూ తీసిన చిత్రమిది. దీని కోసం ఎంతో పరిశోధన చేశా. ఈ కథ రాయడానికి పురాణ ఇతిహాసాలను చదివా. రమణ మహర్షి ఆశ్రమంతో పాటు చాలా మంది గురూజీలను కలిశా. వాళ్ళ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసి... వాళ్ళను కలిసి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుకుని కథలో మిళితం చేశా'' అని చెప్పారు.
Also Read: 'కాంతార'ను బీట్ చేసిన 'ఇడ్లీ కొట్టు'... అక్కడ ధనుష్ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు!
'అరి' కథ గురించి జయశంకర్ మాట్లాడుతూ... ''అరిషడ్వర్గాలను అదుపులో ఎలా పెట్టుకోవాలో ఇంత వరకు ఏ గ్రంథాలలోనూ చెప్పలేదు. ఎందుకు అలా జరిగింది? అని గురూజీలను అడిగి తెలుసుకున్నా. కొంత కాలం ఆశ్రమాల్లో గడిపి ఆధ్యాత్మిక కోణంలో అరిషడ్వర్గాల మీద అధ్యయనం చేశా'' అని చెప్పారు. ఆ కథను తనదైన కోణంలో తెరకెక్కించినట్టు ఆయన వివరించారు.
విడుదలకు ముందు పలు అవార్డులు, ప్రశంసలు!'అరి' సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి ముందు పలు అంతర్జాతీయ వేదికలలో ప్రదర్శించారు. దాదాపు 25 అవార్డులు వచ్చాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, పీఠాధిపతులు చిత్రాన్ని చూశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. ఆల్రెడీ విడుదలైన 'అరి' సినిమా పాటలు 'చిన్నారి కిట్టయ్య', 'భాగా భాగా'కు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇందులో అనసూయ, డైలాగ్ కింగ్ సాయి కుమార్, 'శుభలేఖ' సుధాకర్, సురభి ప్రభావతి, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష ప్రధాన పాత్రలు పోషించారు. ప్రేక్షకుల నుంచి చిత్రానికి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.