Rishab Shetty' Kantara Chapter 1 Two Days Box Office Collection: వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ బరిలో 'కాంతార ఛాప్టర్ 1' అదరగొడుతోంది. మొదటి రోజు ఈ సినిమా వసూళ్ల దుమ్ము దులిపింది. ఓపెనింగ్ డే 89 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. మరి రెండో రోజు సినిమా కలెక్షన్లు ఎంతో తెలుసా?
ఓపెనింగ్ డేతో కంపేర్ చేస్తే 25 శాతం డ్రాప్!Kantara Chapter 1 Two Days Collection: ఇండియాలో మొదటి రోజు 'కాంతార ఛాప్టర్ 1' అదరగొట్టింది. ఒక్క మన దేశంలోనే 61.85 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ రాబట్టింది. దాంతో కంపేర్ చేస్తే రెండో రోజు కలెక్షన్లలో 25 శాతం డ్రాప్ కనిపించింది. అయినా సరే వసూళ్ల దుమ్ము దులిపింది.
'కాంతార ఛాప్టర్ 1'కు రెండో రోజు కర్ణాటక (కన్నడ వెర్షన్)లో రూ. 13.5 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా దుమ్ము దులుపుతోంది. రెండో రోజు 'కాంతార ఛాప్టర్ 1' తెలుగు కలెక్షన్స్ 12 కోట్ల రూపాయలు. అయితే హిందీలో హ్యుజ్ డ్రాప్ కనిపించింది. మొదటి రోజు 'కాంతార ఛాప్టర్ 1' నెట్ రూ. 18.5 కోట్లు అయితే... రెండో రోజు నెట్ కలెక్షన్ 12 కోట్ల రూపాయలు మాత్రమే. తమిళంలో రూ. 4.5 కోట్లు, మలయాళంలో రూ. 4 కోట్లు వచ్చాయి.
Also Read: దసరాకు సైలెంట్‌గా విజయ్ దేవరకొండ - రష్మిక ఎంగేజ్మెంట్... 2026లో పెళ్లి!?
మొదటి రోజు ఇండియాలో రూ. 61.85 కోట్లు నెట్ రాబట్టిన 'కాంతార ఛాప్టర్ 1', ఆ తర్వాత రోజు రూ. 46 కోట్లతో సరిపెట్టుకుంది. రెండు రోజుల్లో ఇండియాలో ఈ మూవీ నెట్ కలెక్షన్లు వంద కోట్లు దాటాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ విషయానికి వస్తే... 150 కోట్ల మార్క్ రీచ్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల టాక్.
రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'కాంతార ఛాప్టర్ 1' సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకం మీద విజయ్ కిరగందూర్ ప్రొడ్యూస్ చేశారు. రిషబ్ శెట్టి సరసన కనకవతి పాత్రలో రుక్మిణీ వసంత్ నటించారు. మలయాళ నటుడు జయరామ్, బాలీవుడ్ యాక్టర్ గుల్షన్ దేవయ్య,ప్రమోద్ శెట్టి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బలంగా నిలిచాయి.