సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే అభినయంతో పాటు అందం కూడా చాలా అవసరం. నటన రాకపోయినా పర్లేదు కానీ గ్లామర్ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తూ ఉంటాయి అని చాలామంది హీరోయిన్స్ ఫీలవుతూ ఉంటారు. అందుకే మరింత అందంగా కనిపించేందుకు తమ శరీర అవయవాలకు సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఈ సర్జరీలు ఫెయిల్ అయిన దాఖలాలు కూడా లేకపోలేదు. మన తెలుగు నుంచి ప్రముఖ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ బేరియాట్రిక్ సర్జరీ చికిత్స చేయించుకున్న సమయంలో అనారోగ్యం బారిన మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వార్త తెలుగు సినీ ఇండస్ట్రీలోనే పెను సంచలనాన్ని సృష్టించింది.


ఇక ఈమధ్య కూడా పలువురు హీరోయిన్స్ సర్జరీ వికటించి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ ఏడాది కిమ్ కర్దానియాలా కనిపించేందుకు క్రిస్టినా అస్టయిన్ గోర్కాని అనే మోడల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోక గుండెపోటుతో మరణించింది. రీసెంట్ గా కన్నడ సీరియల్ నటి చేతన రాజ్ కూడా ఫ్యాట్ ఫ్రీ సర్జరీ చేయించుకోగా అది కాస్త వికటించడంతో 21 ఏళ్లకే కన్ను మూసింది. తాజాగా మరో నటి ప్లాస్టిక్ సర్జరీ వికటించి ప్రాణాలు విడిచింది. అర్జెంటీనాకి చెందిన మాజీ అందాల సుందరి నటి జాక్వెలిన్ కరీరి మరింత అందంగా మారెందుకు కాస్మోటిక్ సర్జరీ చేసుకుంది. సర్జరీ జరుగుతున్న సమయంలో రక్తం గడ్డ కట్టడం వల్ల చనిపోయినట్లు తెలుస్తోంది.


పలు ఆంగ్ల చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జాక్వలిన్ కరిరి అక్టోబర్ 1న చనిపోయింది. తాజాగా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమె మరణ వార్త విని పలువురు హాలీవుడ్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. జాక్వెలిన్ కరీరి మరణించినప్పుడు ఆమె పిల్లలు క్లో, జూలియన్ పక్కనే ఉన్నట్లు సమాచారం. కాస్మెటిక్ సర్జరీ వల్ల రక్తం గడ్డ కట్టకపోవడంతో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లో జాక్విలింగ్ మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.


కాస్మోటిక్ సర్జరీల్లో భాగంగా ఉపయోగించే రసాయనాల కారణంగా గుండె కొట్టుకునే వేగం ఆకస్మాత్తుగా పడిపోతుంది. ఊపిరాడకుండా ఉండటం, చాతి నొప్పులు, రక్తం గడ్డ కట్టడం, రక్తస్రావం కూడా అవుతుందని నిపుణులు చెబుతున్నా సెలబ్రిటీలు మాత్రం తమ అందాన్ని పెంచుకునేందుకు ఇలా కాస్మోటిక్ సర్జరీలు చేయించుకునేందుకు సిద్ధపడుతున్నారు. కొన్నిసార్లు ఆ సర్జరీలు వికటించి చివరికి ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.


ఇక అర్జెంటీనా నటి జాక్వెలిన్ కరిరి విషయానికొస్తే.. మోడల్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె 1996లో అర్జెంటీనాలోని షాన్ రాఫెల్ అండ్ వెండిమియా గ్రేప్ హార్వెస్ట్ ఫెస్టివల్ లో జరిగిన అందాల పోటీలో రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పలు ఇంగ్లీష్ చిత్రాలతో గట్టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇదే అర్జెంటీనాకు చెందిన ప్రముఖ నటి, మోడల్, టీవీ ప్రెసెంట్ సిల్వినా లూనా కూడా ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో ప్రాణాలు కోల్పోయింది. కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఈమె ఆగస్టు 31న చనిపోయినట్లు ఆమె తరపు న్యాయవాది అధికారికంగా ధ్రువీకరించారు.


Also Read : 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ : స్వాతి, నవీన్ చంద్ర సినిమా హిట్టా? ఫట్టా?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial