Anupama Parameswaran Opens Up About Her Best Friends : టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన లవ్, బ్రేకప్ స్టోరీ, పర్సనల్ లైఫ్ గురించిన విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తాజాగా మరో ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్స్... తనకు అండగా నిలిచే ఇద్దరు హీరోల గురించి చెప్పారు.

Continues below advertisement

'నేను బాధలో ఉంటే...'

తాను బాధలో ఉంటే తనకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ అని తెలిపారు అనుపమ పరమేశ్వరన్. 'నేను డల్‌గా ఉన్న ప్రతిసారీ నాకు దుల్కర్ నుంచి మెసేజ్ వస్తుంది. అది చూసి నేను ఆశ్చర్యపోతుంటా. నేను బాధలో ఉన్న విషయం తనకు ఎలా తెలుసా అని అనుకుంటా. దుల్కర్‌తో కాసేపు మాట్లాడితే నా బాధంతా పోతుంది. ఆయన తర్వాత నేను మళ్లీ అంతగా నమ్మే వ్యక్తి టాలీవుడ్ హీరో రామ్.' అంటూ చెప్పారు.

Continues below advertisement

అయితే, దుల్కర్‌, అనుపమ జంటగా 'జోమోంటే సువిశేషంగల్' అనే మూవీలో నటించారు. ఇక యంగ్ హీరో రామ్‌తో 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురు ప్రేమ కోసమే' సినిమాల్లో నటించారు. ఈ రెండు మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి.

Also Read : Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు

'మానసిక వేధింపులు'

ఇదే ఇంటర్వ్యూలో తన లవ్, రిలేషన్ షిప్ గురించి కూడా మాట్లాడారు అనుపమ పరమేశ్వరన్. మాజీ ప్రియుడి చేతిలో తాను ఎదుర్కొన్న మానసిక వేధింపుల గురించి, తన గత ప్రేమ కథ గురించి చెప్పారు. 'నార్సిసిస్టిక్ అబ్యూస్ (మానసిక వేధింపులు) అనేది చాలా సైలెంట్‌గా జరుగుతుంది. అలాంటి వాళ్లు ఎప్పుడూ ఇతరులను తమ కంట్రోల్‌లో ఉంచుకోవాలని చూస్తారు.' అని పేర్కొన్నారు. కాగా, అనుపమ ప్రస్తుతం 'క్రేజీ కల్యాణం' మూవీలో హీరోయిన్‌గా నటించారు.

కొద్ది రోజుల క్రితం తన బ్రేకప్ స్టోరీ గురించి చెబుతూ అనుపమ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను బంధంలో ఉన్నప్పుడు ప్రతీ నిమిషం భయం, ఆందోళనతో గడిపినట్లు తెలిపారు. తన ఫ్రెండ్స్‌కు కూడా దూరమయ్యానని... అదొక టాక్సిక్ రిలేషన్ షిప్ అని చెప్పారు. కోలీవుడ్ స్టార్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్‌తో అనుపమ రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం సాగింది. ఆ తర్వాత వీరి ఫోటోస్ సైతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Also Read : Vishwanath And Sons Day 2 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.