Animal Movie Shows: ప్రతీ భాషలోని ప్రేక్షకులు ఒక సినిమా గురించి ఇంతలాగా మాట్లాడుకొని చాలాకాలమే అయ్యింది. అంతలా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది ‘యానిమల్’ చిత్రం. సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందుకే సినిమా విడుదలై అయిదు రోజులు అవుతున్నా ఇంకా హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవ్వడమే కాకుండా కలెక్షన్స్ విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ స్క్రీనింగ్ గురించి థియేటర్ల యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం చూసి ‘యానిమల్’ మూవీ లవర్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
24x7 స్క్రీనింగ్స్..
డిసెంబర్ 1న ‘యానిమల్’ చిత్రం థియేటర్లలో విడుదలయ్యింది. ఏ సినిమా లేనంతగా 3 గంటల 21 నిమిషాల నిడివితో ‘యానిమల్’ విడుదల అవ్వడంతో థియేటర్లలో షోలకు మామూలుకంటే కాస్త ఎక్కువ సమయమే పడుతోంది. అందుకే 24x7 స్క్రీనింగ్స్ ఏర్పాటు చేయాలని ప్రేక్షకులు కోరారు. ఈ ఐడియా బాగుందని థియేటర్ల యాజమాన్యాలు కూడా దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టాయి. ఇక తాజాగా ‘యానిమల్’కు అర్థరాత్రి 2 గంటల వరకు తిరిగి ఉదయం 5.30 నుంచి షోలు వేసే అనుమతి దొరికింది. ఇక షోలు పెరగడం అనేది ‘యానిమల్’ చూడాలనుకొని టికెట్లు దొరకక చూడలేకపోయిన వారికి గుడ్ న్యూస్‌గా మారింది. ఇప్పటికీ హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవుతున్న ఈ మూవీ కలెక్షన్స్‌ను మరింత పెంచడానికి ఈ 24x7 స్క్రీనింగ్స్ ఉపయోగపడతాయి. అయితే, ఏయే రాష్ట్రాల్లో దీనికి అనుమతి లభించిందనేది తెలియాల్సి ఉంది.
రష్మికను మించిపోయిన తృప్తి..
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’లో హీరోయిన్‌గా రష్మిక నటించింది. కానీ మూవీ విడుదలయిన తర్వాత ఇందులో కీలక పాత్ర చేసిన తృప్తి దిమ్రీ యాక్టింగ్‌కు విశేష స్పందన లభిస్తోంది. తన పాత్ర ఉన్నది కాసేపే అయినా తన బోల్డ్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతే కాకుండా రష్మికకంటే తృప్తి నే బాగుందని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా రణబీర్‌తో రష్మిక కంటే తృప్తి కెమిస్ట్రీనే బాగుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అందుకే తెలుగు నుంచి కూడా నిర్మాతలు తనకు ఆఫర్లు ఇవ్వడానికి క్యూ కట్టారట. ఇలా ప్రతీ అంశంతో ఆడియన్స్.. తన సినిమాకు ఫిదా అయ్యేలా చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.
బాక్సాఫీస్ లెక్కలు..
బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే.. ‘యానిమల్’.. ఉన్న రికార్డులను బద్దలుకొడుతూ.. కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వెళ్తోంది. రెండో రోజు బుకింగ్స్ విషయంలో ‘జవాన్’, ‘లియో’ వంటి చిత్రాలను మించిపోయిందట ‘యానిమల్’. సెకండ్ డే కలెక్షన్స్ విషయానికొస్తే.. రూ.29 కోట్లు మార్క్‌ను టచ్ చేసిందట. దీంతో రెండో రోజు కలెక్షన్స్ విషయంలో ‘జవాన్’ చిత్రానికి రికార్డును బద్దలగొట్టింది ‘యానిమల్’. ఇక ఇండియాలో మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ‘యానిమల్’ తన సత్తా చాటుకుంటోంది. కేవలం నార్త్ అమెరికాలోనే 2.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిందట ఈ సినిమా. మొదటి రోజే ఎక్కువ కలెక్షన్ సాధించిన హిందీ సినిమాగా ‘యానిమల్’.. అక్కడ కూడా రికార్డ్ క్రియేట్ చేసింది.
Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీ కపూర్ - ఫోటో వైరల్