Anil Ravipudi Funny Reaction On NTR Movie Update : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ రాబోతోన్న సంగతి తెలిసిందే. అప్పుడే దీనిపై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది. తాజాగా, దీని అప్డేట్ గురించి ఓ మూవీ ఈవెంట్‌లో అనిల్‌ను అడగ్గా... ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
రెండు చేతులు జేబులో పెట్టుకుని...
'హై' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మూవీ గురించి అప్డేట్ అడగ్గా... రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని స్టేజ్‌పై నుంచి కిందకు దిగిపోయారు. ఆ తర్వాత పైకి వచ్చి... 'మొన్నే కదా అనౌన్స్ అయ్యింది. చిన్నగా మెల్లగా ఒక్కో అప్డేట్ వస్తుంది.' అంటూ సరదాగా స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇటీవలే ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీపై అనౌన్స్‌మెంట్ వచ్చింది. మాస్, యాక్షన్ కథలకు భిన్నంగా కామెడీ, ఫన్ జానర్‌లో ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 'నవ్వుల విందు సిద్ధమవుతోంది' అంటూ తారక్ పోస్ట్ చేయగా... ఇద్దరి కాంబోలో ఫుల్ కామెడీ ట్రీట్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌తో 'డ్రాగన్' మూవీ కంప్లీట్ కాగానే... ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ నిర్మించనున్నారు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకీ, కల్యాణ్ రామ్‌లతో 'జనవరి 12 విడుదల' మూవీ చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉండగా... రీసెంట్‌గా రిలీజైన 'దివికి దివికి' సాంగ్ ట్రెండ్ అవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుండగా... ఇప్పటికే వెరైటీ ప్రమోషన్స్‌తో మూవీ టీం దూసుకెళ్తోంది. త్వరలోనే టీజర్, ట్రైలర్ అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ మూవీపై ఫోకస్ చేయనున్నారు అనిల్ రావిపూడి.
Also Read : Emotional Drama OTT : ఓటీటీలోకి వచ్చేసిన 'రంగస్థలం' - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
