పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మైతలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్' మరికొన్ని గంటల్లోనే థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో మొట్టమొదటిసారి ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించగా, కృతి సీత పాత్రలో కనిపించబోతోంది. అలాగే బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఓంరౌత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక తాజాగా ఈ సినిమా యూనిట్ కి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి.


అదేంటంటే సినిమా టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవడానికి ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్నప్పుడు ఆయా సినిమాల నిర్మాతల అభ్యర్థుల మేరకు మొదటివారం టికెట్ రేట్లను పెంచుకునే తెలుగు రాష్ట్రాలు వెసలపాటు కల్పిస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆదిపురుష్ విషయంలోనూ అదే జరిగింది. ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఆదిపురుష్ టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ జీవో కూడా విడుదల చేయగా.. ఆ జీవో ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో టికెట్ పై రూ.50 రూపాయలు పెంచేకునే అవకాశం కల్పించింది. అయితే అది కేవలం మొదటి మూడు రోజులు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు జీవోలో పేర్కొంది. అంతేకాకుండా మూడు రోజులపాటు రోజుకు 6 షోలకు పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఈ లెక్కన తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆదిపురుష్ చిత్రాన్ని థియేటర్స్ లో ప్రదర్శించుకోవచ్చు.


ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ ధరపై 50 రూపాయలు పెంచినట్లు కాసేపటి క్రితమే ఓ జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం జూన్ 16 నుండి పది రోజులపాటు పెంచిన టికెట్ రేట్లు అమ్ముకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీని ప్రకారం ఆదిపురుష్ టికెట్ ధర మల్టీప్లెక్స్ లో రూ.236 అలాగే సింగిల్ స్క్రీన్స్ లో రూ.210 గా ఉన్నాయి. కాగా ఇప్పటికే తెలంగాణలో ఆదిపురుష్ కు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అటు నార్త్ లోను రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. రేపు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. కాగా ఆదిపురుష్ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేస్తుంది. ఇక మోషన్ క్యాప్చర్ 3D టెక్నాలజీ తో విజువల్ వండర్ గా రూపొందిన ఈ సినిమాని రెట్రో ఫైల్స్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. అజయ్ అతుల్ సంగీతం అందించారు.


Also Read: 'దృశ్యం 3'పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ - మలయాళం, హిందీలో ఒకేసారి చిత్రీకరణ, మరి తెలుగులో?