Roshan Kanakala's Mowgli Release Date Fixed: యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల మరో క్రేజీ ప్రాజెక్టుతో రాబోతోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ మూవీ 'బబుల్ గమ్' అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ 'మోగ్లీ'తో రాబోతున్నారు. కలర్ ఫోటో ఫేం సందీప్ రాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా... ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ స్పెల్లింగ్ గుర్తు పెట్టుకోండి

ఈ మూవీకి సంబంధించి ఓ స్పెషల్ సర్ ప్రైజ్‌ను ఆగస్ట్ 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు సందీప్ రాజ్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. '1850 రోజుల తర్వాత నా రెండో సినిమా మొదటి విహార యాత్ర వస్తోంది. 'MOWGLI' ఈ పేరు స్పెల్లింగ్ గుర్తు పెట్టుకోండి.' అంటూ సందీప్ తన ఇన్ స్టాలో రాసుకొచ్చారు. ఈ మూవీ అనౌన్స్‌‌మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. కలర్ ఫోటోతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న సందీప్... ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఆకట్టుకుంటుంటారు.

జంగిల్ బుక్‌లో ఫేమస్ క్యారెక్టర్ అయిన 'మోగ్లీ'ని టైటిల్‌గా ఎంచుకుని అటవీ నేపథ్యం బ్యాక్ డ్రాప్‌గా ఈ మూవీని తెరకెక్కించినట్లు పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. దట్టమైన అడవిలో కండలు తిరిగిన దేహంతో రోషన్ లుక్ ఆకట్టుకుంటోంది.

Also Read: ఓ వీడియో గేమ్... రాయలసీమ నుంచి ప్రపంచం అంతం - తేజ సజ్జ 'జాంబీ రెడ్డి' సీక్వెల్ అనౌన్స్

ఈ మూవీలో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... ఆమెకు ఇది ఫస్ట్ మూవీ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా... కాల భైరవ మ్యూజిక్ అందిస్తున్నారు. 

ఈసారి...

ఫస్ట్ మూవీ 'బబుల్ గమ్' అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయినా తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు రోషన్ కనకాల. ఇప్పుడు 'మోగ్లీ' మూవీతో ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు. సందీప్ రాజ్ దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుండగా భారీగానే ఆశలు పెట్టుకున్నారు.