Roshan Kanakala Speech In Mowgli Thanks Meet : యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల రీసెంట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'మోగ్లీ' ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో నిర్వహించిన థాంక్స్ మీట్‌కు సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా రోషన్ ఎమోషనల్ అయ్యారు.

Continues below advertisement

'వారు ఈవెంట్స్‌కు రాలేరు'

'మోగ్లీ' సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు రోషన్. 'నాకు సినిమా అంటే ప్రాణం. మా సినిమాను సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు థాంక్స్. ముఖ్య అతిథిగా వచ్చి మాకు సపోర్ట్ చేసిన సాయి దుర్గా తేజ్ అన్నకు థాంక్స్. టాలీవుడ్ హీరోస్, వారి అభిమానులు నాకు చాలా సపోర్ట్ చేశారు. హార్డ్ వర్క్, టాలెంట్, డిసీప్లీన్ ఈ మూడే ఎవరి సక్సెస్ అయినా నిర్ణయిస్తాయి. మోగ్లీ సినిమా కోసం నేను నా ప్రాణం పెట్టాను.

Continues below advertisement

మా టీం కూడా ఎంతో హార్డ్ వర్క్, లవ్‌తో చేశారు. ఈ 'మోగ్లీ'ని ఆడియన్స్ గెలిపించారు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని మా అమ్మ సుమను అడిగితే... 'నీ హార్డ్ వర్క్ నమ్మి ముందుకు సాగు' అని చెప్పింది. హార్డ్ వర్క్ చేశాను. నా దురదృష్టం ఏంటంటే మా అమ్మ నాన్న ఇలా ఈవెంట్స్‌కు రాలేరు. ఒకవేళ వచ్చుంటే వారిద్దరి కాళ్లు మొక్కి నమస్కరించేవాడిని. వాళ్లు లేకుంటే నేను లేను. థాంక్యూ అమ్మా. థాంక్యూ నాన్న.' అంటూ ఎమోషనల్ అయ్యారు.

Also Read : ఆ స్టోరీకి చికిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్

'కలర్ ఫోటో' ఫేం సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన మూవీలో రోషన్ సరసన సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటించారు. బండి సరోజ్ కుమార్ విలన్ రోల్ పోషించగా హర్ష చెముడు కీలక పాత్ర పోషించారు. వీరితో పాటే సుహాస్, రియా సుమన్ అతిథి పాత్రల్లో మెరిశారు. కాలభైరవ మ్యూజిక్ అందించగా... పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ప్రస్తుతం మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది.