Anchor Shyamala About Bengaluru Rave Party: టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా రేవ్ పార్టీ గురించే చర్చలు నడుస్తున్నాయి. బెంగుళూరులో జరిగిన ఈ రేవ్ పార్టీకి వెళ్లినట్టుగా కొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఒక్కొక్కరు అసలు అక్కడికి వెళ్లారా లేదా అనే విషయంపై క్లారిటీ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి యాంకర్ శ్యామల కూడా యాడ్ అయ్యింది. బెంగుళూరు రేవ్ పార్టీలో తను ఉన్నానా లేదా అనే విషయంపై క్లారిటీ ఇస్తూ శ్యామల ఒక వీడియోను విడుదల చేసింది. అందులో కేవలం ఒక ఛానెల్ మాత్రమే తనను టార్గెట్ చేసిందంటూ జర్నలిస్టులకు ఒక సలహా కూడా ఇచ్చింది శ్యామల.
పరువునష్టం దావా..
‘‘బెంగుళూరు రేవ్ పార్టీ.. అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు అస్సలు తెలియదు కానీ అందులో నేను కూడా ఉన్నానంటూ ఒక ఛానెల్ నా పేరును దుష్ప్రచారం చేస్తున్నారు. అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే.. ఒక పార్టీతో నేను అనుసంధానం అయ్యి ఉన్నాననే విషయం తెలిసి మా పార్టీ మీద, మా మీద బురజ జల్లే ప్రయత్నంలో భాగంగా వాళ్లు చేసే అసత్య ప్రచారాన్ని ఏ మాత్రం ఊరుకునేది లేదు. వాళ్ల మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ల మీద పరువునష్టం దావా ఫైల్ చేశాం’’ అంటూ తన పేరును అనవసరంగా బెంగుళూరు రేవ్ పార్టీకి వెళ్లినవారి లిస్ట్‌లో యాడ్ చేసిన ఛానెల్‌కు వార్నింగ్ ఇచ్చింది శ్యామల.
విలువలు తగ్గించొద్దు..
‘‘జర్నలిస్టులు అనేవాళ్లు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగేవాళ్లు అయ్యిండాలి. అంతే గానీ ఇలా అసత్యపు ప్రచారాలు చేసేవాళ్లు జర్నలిస్టులు కాదు. దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించొద్దు’’ అంటూ జర్నలిస్టులకు సలహా ఇచ్చింది శ్యామల. ఇప్పటికే టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా రేవ్ పార్టీ అనే మాటే వినిపిస్తోంది. హేమ, శ్రీకాంత్ లాంటి వాళ్లు ఆ పార్టీలో ఉన్నారని డ్రగ్స్ తీసుకున్నారని వార్తలు రాగా అదంతా అబద్ధం చెప్తూ వీరిద్దరూ వీడియోలు విడుదల చేశారు. కానీ వీరి మాటలు నమ్మడానికి చాలామంది సిద్ధంగా లేరు. ముఖ్యంగా హేమపై అయితే ఓ రేంజ్‌లో విమర్శలు వినిపిస్తున్నాయి.
వైసీపీ సపోర్ట్..
ఏపీలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో యాంకర్ శ్యామల.. వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కనిపించింది. అంతే కాకుండా పార్టీ ప్రచారకర్తగా యాక్టివ్ పాత్ర పోషించింది. దీంతో అప్పటినుండి కావాలనే తనను కొందరు టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టింది. సినీ పరిశ్రమకు చెందిన చాలామంది జనసేనకు, టీడీపీ కూటమికి సపోర్ట్ చేస్తుండగా శ్యామల మాత్రమే వైసీపీకి ప్రచారం చేయడానికి ముందుకొచ్చింది. దీంతో తనపై ఇండస్ట్రీలో విమర్శలు వినిపించాయి. సీనియర్ యాక్టర్ పృథ్విరాజ్ సైతం యాంకర్ శ్యామలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రేవ్ పార్టీ విషయంలో తన పేరు బయటికి రావడానికి కారణం కూడా వైసీపీకి సపోర్ట్ చేయడం వల్లే జరిగిందని వీడియోను ఇన్‌డైరెక్టర్‌గా చెప్పుకొచ్చింది శ్యామల.
Also Read: డ్రగ్స్‌తో దొరికావు - బెంగళూరు రేవ్ పార్టీ, హేమపై కరాటే కళ్యాణి సెన్సేషనల్ కామెంట్స్