దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావుతో సినిమా చేయాలని చాలా మంది హీరోలు, హీరోయిన్లు కలలు కంటారు. అందుకు స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ కూడా అతీతం ఏమీ కాదు. 'రంగస్థలం'లో రంగమ్మత్తగా, 'క్షణం'లో ఏసీపీ భరద్వాజ్‌గా, 'యాత్ర'లో చరితా రెడ్డిగా, 'పుష్ప'లో దాక్షాయనిగా... డిఫరెంట్ రోల్స్ చేసిన అనసూయను రాఘవేంద్రరావు కొత్తగా చూపించబోతున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోంది. అయితే... ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే... ఆ సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకుడు కాదు, నిర్మాణంలో భాగస్వామి.


రాఘవేంద్ర రావు నిర్మాణ సంస్థలో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో అనసూయ భరద్వాజ్ ఓ పాత్రలో కనిపించనున్నారు. "రాఘవేంద్ర రావు గారితో సినిమా చేయాలనేది నా కల. ఆయనతో పని చేసే అవకాశం రావడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాను" అని అనసూయ పేర్కొన్నారు. సినిమాలో ఆమెది కామెడీ రోల్ అని ఫిల్మ్ నగర్ టాక్.


Also Read: తారక్ సూపర్ కంప్యూటర్, చరణ్ వైట్ కాన్వాస్ - నటనలో ఇద్దరి మధ్య తేడా ఏంటో చెప్పిన రాజమౌళి


రాఘవేంద్ర రావు సినిమాలో అనసూయకు రోల్ రావడం వెనుక 'పుష్ప: ద రైజ్' సినిమా సక్సెస్ పార్టీ కారణం అని చెప్పాలి. ఎందుకంటే... సక్సెస్ పార్టీకి రాఘవేంద్ర రావు వచ్చారు. అప్పుడు ఆయన్ను కలిసిన అనసూయ, తన మనసులో మాటను చెప్పారు. అది గుర్తు పెట్టుకున్న దర్శకేంద్రుడు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం 'పక్కా కమర్షియల్' సినిమాలో అనసూయ నటిస్తున్నారు. ఇది కాకుండా 'రంగ మార్తాండ' సినిమా కూడా చేస్తున్నారు. 'పుష్ప 2' షూటింగ్ కూడా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. 'జబర్దస్త్' కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 


Also Read: విద్యాబాలన్ ను హాట్ ఫొటోషూట్ గురించి ప్రశ్నించిన నెటిజన్, కౌంటర్ ఇచ్చిన నటి