నటి, యాంకర్ అనసూయ రూటే సపరేటు. ఇటు ట్రెడిషనల్, అటు వెస్ట్రన్ కల్చర్... ఎటువంటి డ్రస్ అయినా ధరించగలరు. కాన్ఫిడెంట్‌గా క్యారీ చేయగలరు. తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ వంటి వాటికి అటెండ్ అయితే చక్కగా చీరలో సందడి చేస్తారు. ఫారిన్ టూర్లకు వెళ్ళినప్పుడు వెస్ట్రన్ డ్రస్‌లు ధరిస్తారు. ఆ మధ్య ఓసారి విదేశాలు వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్ (టబ్బులో) అనసూయ ఎంజాయ్ చేశారు. అప్పుడు స్విమ్ సూట్ ధరించారు. ఆ వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
శివాజీ కామెంట్స్ కాంట్రావర్సీ...ఇప్పుడు పాత వీడియో మళ్ళీ ఎందుకు?అనసూయ మోడ్రన్ డ్రస్సులు ధరించి ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం చాలా కామన్. ఇవాళ కూడా ఉదయం నిండుగా చీర కట్టుకున్న ఫోటోలు షేర్ చేశారు. ఆ తర్వాత కాసేపటికి స్విమ్మింగ్ పూల్ వీడియో షేర్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... ఆ వీడియో ఇప్పటిది కాదు. గతంలో ఒకసారి పోస్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ షేర్ చేశారు.
Also Read: శివాజీ తప్పేముంది? యంగ్ హీరో రక్షిత్ అట్లూరి సపోర్ట్
ఇటీవల మహిళల దుస్తులపై, ఎటువంటి దుస్తులు ధరిస్తే బావుంటుందనే అంశం మీద నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆ కామెంట్స్ మీద అనసూయ స్పందించడం, 'మీరు ఎందుకు వచ్చారు అనసూయ గారు' అని శివాజీ అడగటంతో పాటు 'త్వరలో అనసూయ గారి రుణం తీర్చుకునే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా' అంటూ చెప్పడం చర్చకు దారి తీసింది. మహిళలకు ఆయన చెప్పిన క్షమాపణలపై అనసూయ మరో వీడియో చేశారు. తానూ హీరోయిన్ కనుక స్పందించానని చెప్పారు.
ఇప్పుడు స్విమ్ సూట్ ధరించిన వీడియో మళ్ళీ షేర్ చేయడం వెనుక అనసూయ ఆంతర్యం ఏమిటి? అదీ శివాజీ ఇష్యూ నేపథ్యంలో పాత వీడియో ఎందుకు పైకి తీశారు? అనేది చర్చనీయాంశం అవుతోంది. చీర కట్టుకున్న ఫోటోలు, స్విమ్ సూట్ ధరించిన వీడియో... రెండిటి కింద వచ్చిన కామెంట్స్ కంపేర్ చేసే ఆలోచనలో అనసూయ ఉన్నారా? ఎటువంటి దుస్తులు ధరించినా సరే కొందరు మగాళ్లు ఒకే విధమైన కామెంట్స్ చేస్తారని చెప్పదలుచుకున్నారా? లేదంటే మరెవరిని అయినా రెచ్చగొట్టేందుకు స్విమ్ సూట్ వీడియో విడుదల చేశారా? ఆవిడకు మాత్రమే తెలియాలి.