Anasuya Bharadwaj's Reaction On Sivaji Comments : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై సీనియర్ హీరో శివాజీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. నెటిజన్లు కొందరు ఆయన కామెంట్స్‌ను సమర్థిస్తుండగా మరికొందరు ఆయన చెప్పిన విధానం, వాడిన పదాలు కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సింగర్ చిన్మయి ఆయన కామెంట్స్‌పై స్ట్రాంగ్ రియాక్షన్ ఇవ్వగా... యాంకర్ అనసూయ ఇండైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చారు.

Continues below advertisement

లేటెస్ట్ పోస్ట్ వైరల్

'ఇది నా శరీరం... మీది కాదు' అంటూ తాజాగా అనసూయ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై శివాజీ చేసిన కామెంట్స్‌ను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ చేశారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొందరు ఆమెకు కౌంటర్ ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 'శివాజీ సర్ చెప్పింది కరెక్ట్. మీరు డైరెక్ట్‌గా మెన్షన్ చేయాల్సింది' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా... 'మనం సొసైటీలో ఉంటున్నాం. మనుషులకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇలా అనుకుంటే మళ్లీ వెనక్కు వెళ్లి బతకాల్సి వస్తుంది.' అంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని చెప్పాడు.

Continues below advertisement

సింగర్ చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్

అంతకు ముందు సింగర్ చిన్మయి సైతం శివాజీ కామెంట్స్‌పై స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. తెలుగు నటుడు శివాజీ హీరోయిన్లకు బూతు పదాలతో అనవసర సలహాలు ఇచ్చారని... ఈ పదాలను పోకిరీలు ఎక్కువగా ఉపయోగిస్తారని అన్నారు. ఓ అద్భుతమైన సినిమాలో విలన్‌గా నటించిన శివాజీ పోకిరీలకు హీరోగా మారారని తెలిపారు. 'శివాజీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ధోతీ కట్టుకుని భారతీయ సంప్రదాయాల్ని అనుసరించాలి. కానీ జీన్స్, హుడీ వేసుకున్నాడు. అసలు మహిళల్ని ఇక్కడ ఎలా చూస్తున్నారో అర్థమవుతోంది.' అంటూ ట్వీట్ చేశారు.

Also Read : రాజాలా పెంచితే రోజా ముందు కూర్చున్నావ్ - నవ్వులు పూయిస్తోన్న 'నారీ నారీ నడుమ మురారి' టీజర్

శివాజీ ఏం అన్నారంటే?

'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై కామెంట్స్ చేశారు. హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందని అన్నారు. 'నేను ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు. అనుకున్నా పోయేదేం లేదు. అందం అనేది చీరలో నిండుగా కప్పుకొనే బట్టల్లో ఉంటుంది. అంతే తప్ప సామాన్లు కనపడే దాంట్లో ఏమీ ఉండదు.

అవి వేసుకున్నప్పుడు చాలా మంది చూసి నవ్వుతారు. కానీ దరిద్రపు ము**** ఇలాంటి బట్టలెందుకు వేసుకుంది. కాస్త మంచి బట్టలు వేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది లోపల. అలా అనలేం. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. మన వేష భాషల నుంచే మన గౌరవం పెరుగుతుంది. ప్రపంచ వేదికలపై చీర కట్టుకున్న వారికే విశ్వ సుందరి కిరీటాలు వచ్చాయి.' అంటూ కామెంట్స్ చేశారు.

అయితే, శివాజీ ఈ కామెంట్స్ చేసే ముందే ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. 'హీరోయిన్లు ఏమీ అనుకోవద్దు. మీరనుకున్నా నాకు పోయేదేం లేదు. లాగి పీకుతాం మనం అది వేరే విషయం' అంటూ ముందే చెప్పారు. దీంతో ఈ కౌంటర్లకు ఆయన సమాధానం ఇస్తారో లేదో ఎలా రియాక్ట్ అవుతారో? తెలియాల్సి ఉంది.