Anchor Anasuya Satirical Tweet On Actor Sivaji : అప్పుడెప్పుడో దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సీనియర్ నటుడు శివాజీ మహిళల డ్రెస్సింగ్‌పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అటు, సోషల్ మీడియా ఇటు ఇండస్ట్రీలో ఈ కాంట్రవర్సీ కొద్ది రోజుల పాటు సాగింది. మహిళా కమిషన్ ముందు... ఆ తర్వాత ప్రెస్ మీట్స్ పెట్టి మరీ శివాజీ తన కామెంట్స్‌పై వివరణ ఇచ్చారు.
కొద్ది రోజులకు ఈ వివాదం సద్దుమణిగినట్లే కనిపించింది. అయితే, మళ్లీ అనసూయ సెటైరికల్ ట్వీట్‌తో ఈ కాంట్రవర్సీ మళ్లీ తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది.
అసలేం జరిగిందంటే?
శివాజీ కామెంట్స్ తర్వాత చాలా ఈవెంట్స్‌లో మహిళలు చీర కట్టులో కనిపిస్తుండగా... ఇది ఆయన కామెంట్స్ ఎఫెక్టే అంటూ చాాలామంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. తాజాగా, యాంకర్ అనసూయ కూడా చీర కట్టుకుని తన ఫ్యామిలీతో కలిసి గుడికి వెళ్లారు. కొందరు నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ... శివాజీ దెబ్బకు చీర కట్టుకుని తిరుగుతున్న అనసూయ అంటూ సెటైరికల్‌గా పోస్ట్ చేశారు. దీనిపై ఆమె కూడా తనదైన స్టైల్‌లో వ్యంగ్యంగానే కౌంటర్ ఇచ్చారు.
శివాజీ సృష్టించిన చీర...
థంబ్ నైల్ అలా కాదు ఇలా ఉండాలంటూ సలహా ఇచ్చారు అనసూయ. 'శివాజీ సృష్టించిన చీర ధరించి తిరుగుతున్న అనసూయ అంటూ థంబ్‌నైల్ పెడతారనుకున్నా. సరైన హెడ్ లైన్ ఇదే కదా... ఎందుకంటే గతంలో మేము ఎప్పుడూ చీరల కట్టుకోలేదు. ఏమైనా పోస్ట్ చేసే ముందు చూసుకోవాలి కదా...' అంటూ కౌంటర్ ఇచ్చారు. నిజానికి ఆమె చాలా ఈవెంట్లలో ఆమె చీర కట్టుకుని కనిపించారు. పలు ఫోటో షూట్లనూ చీరతోనే చేశారు. ఆమె పోస్ట్ వైరల్ అవుతుండగా... నెటిజన్లు కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
Also Read : కొరియన్ కనకరాజు కంసామీద సాంగ్ - కొరియన్ లాంగ్వేజ్ విత్ క్యూట్ లవ్ లిరిక్స్
శివాజీ రియాక్ట్ అవుతారా?
మరి అనసూయ తాజా పోస్టుపై శివాజీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. నిజానికి ఈ వివాదం ఎప్పుడో సద్దుమణిగిందనే అంతా అనుకున్నారు. తాను ఆ రెండు పదాలు మాట్లాడకుండా ఉండాల్సింది అంటూ గతంలోనే పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు శివాజీ. అనసూయను కూడా తాను ఏమీ అనలేదని... ఆ అమ్మాయి అంటే తనకు గౌరవం ఉందని చెప్పారు. తన ఉద్దేశం ఏంటో ప్రజలు అర్థం చేసుకున్నారని... తనకు తెలిసిన వారే కమిషన్‌కు కంప్లైంట్ చేసినట్లు వెల్లడించారు.
అయితే, కోల్డ్ వార్ లాంటిది ఏమీ లేదని... ఇది కొందరు సోషల్ మీడియాలో కావాలని సృష్టిస్తున్న వార్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎలాంటి కాంట్రవర్సీ లేకున్నా వీడియోలు పోస్ట్ చేసి కామెంట్స్ చేయడం... పాత వాటిని గుర్తు చేస్తూ లేని పోని వివాదాలు సృష్టిస్తున్నారంటూ అభిప్రాయపడుతున్నారు.
