Kangana Ranaut About Anant Ambani: తన మనసుకు తోచిన విషయాన్ని ముఖం మీదే చెప్పడంలో ముందుతుంటుది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.  ఆమె తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ మాటలకు ఫిదా అయ్యింది. తన సోదరుడు, సోదరి గురించి ఆయన చెప్పిన విషయాలు మనసుకు ఆకట్టుకున్నాయన్నది. ఓ మీడియా సంస్థకు అనంత్ ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్ ను కంగనా ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ. కీలక విషయాలను వెల్లడించింది.


కంగనా అనంత్ గురించి ఏం చెప్పిందంటే?


కంగనా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన క్లిప్‌‌లో అనంత్ అంబానీ తన సోదరుడు ఆకాష్, సోదరి ఇషా మీద తనకున్న ప్రేమ ఎలాంటిదో చెప్తాడు. తన సోదరుడిని రాముడితో, సోదరిని మాతా రాణితో పోలుస్తాడు. వారికి ఎప్పుడూ తాను అండగా ఉంటానని చెప్తాడు. తమ మధ్య ఏనాడు పోటీ భావం ఉండదన్నారు. “మేము ఒకరినొకరు విశ్వసించినంత కాలం, మేము పోటీ పడే అవకాశం ఉండదు. మేమంతా చాలా ప్రేమగా సన్నిహితంగా ఉంటాం. మాది ఫెయికాల్ బాండిగ్ లాంటిది” అన్నారు. ఈ మాటలను విన్న కంగనా, "అనంత్ నిజంగా సంస్కారవంతుడు. ప్రేమ కలిగిన వాడు. తెలివైన వాడు. బాలీవుడ్ మాఫియా డ్రగ్గీ ముఠాతో కూడా అతడు. అతడికి విషెస్ అంటూ చెప్పుకొచ్చింది.


రాధికతో అనంత్ అంబానీ పెళ్లి


అటు అనంత్ అంబానీ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రాధిక మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. వీరిద్దరి వివాహం మార్చి 1-3 వరకు అట్టహాసంగా జరగనుంది. ఇప్పటికే ముంబై జామ్‌ నగర్‌‌లో 'అన్న సేవ'తో వివాహ ముందు వేడుకలు మొదలయ్యాయి. నూతన పెళ్లి జంట పలువురు పేదలకు భోజనాలు వడ్డించారు.


పెళ్లికి హాజరుకానున్న పలువురు ప్రముఖులు


అనంత్, రాధిక వివాహానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ప్రపంచ ప్రముఖులు హాజరుకానున్నారు. సినీతారలు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా, అజయ్ దేవగన్, కాజోల్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే, రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ సహా పలువురు ఈ వివాహానికి హాజరుకానున్నారు.  


విడుదలకు రెడీ అవుతున్న ‘ఎమర్జెన్సీ’


ఇక కంగనా రనౌత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ సినిమాతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో కంగనా, మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కనిపించబోతోంది. దేశంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించే అవకాశం ఉంది. దీంతో పాటు ‘తను వెడ్స్‌ మను పార్ట్‌ 3’ సినిమా కూడా చేస్తోంది.  


Read Also: అప్పుడు అలాంటి సీన్స్ చేయనని చెప్పాను - కానీ, ఇప్పుడు మనసు మార్చుకున్నా: అనన్య నాగళ్ల