ఇండియాలో ‘పుష్ప’ ఫీవర్ మామోలుగా లేదు. ‘KGF చాప్టర్ 2’ సక్సెస్ తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ‘పుష్ప-2’పై ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ వర్క్‌లో ఉన్న ‘పుష్ప-2’ రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే, ఇప్పటికే ‘పుష్ప: ది రైజ్’లోని డైలాగులు జాతీయ స్థాయిలో ట్రెండవ్వుతున్నాయి. ‘ఐపీఎల్’లో సైతం ‘తగ్గేదేలే’ అంటూ పుష్పరాజ్ సైన్ ట్రెండవ్వుతోంది. తాజాగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’కి కూడా ‘పుష్ప’ ఫీవర్ సోకింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ స్వయంగా అల్లు అర్జున్ డైలాగ్ చెప్పి ఆశ్చర్యపరిచారు. 


‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో ఆడియన్స్ క్వశ్చన్స్‌లో భాగంగా అమితాబ్ ‘పుష్ప’ సినిమాలో ఎర్ర చందనానికి సంబంధించి ఓ ప్రశ్న అడిగారు. ఇందులో భాగంగా ఆయన ‘‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్’’ అంటూ ఓ ప్రశ్న అడిగారు. ‘‘పుష్ప: ది రైజ్ సినిమాలో చూపించిన ఎర్ర చందనం చెట్లు ఇండియాలో ఏ ప్రాంతానికి చెందినవి?’’ అని ప్రశ్నించారు. A. పశ్చిమ కనుమలు, B. సుందర్బన్స్, C. తూర్పు కనుమలు, D. దోబా అనే ఆప్షన్స్ ఇచ్చారు. 


Also Read: ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, అవమానంగా అనిపించింది - మెగాస్టార్ వ్యాఖ్యలు


అల్లు అర్జున్ ఫ్యాన్ ఒకరు దీన్ని ట్వీట్ చేశాడు. దీంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ‘పుష్ప’ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కూడా దీన్ని లైక్ చేశారు. అమితాబ్ నోటితో బన్నీ డైలాగ్ వినేసరికి అల్లువారి అభిమానుల సంతోషానికి అవధుల్లేవు. అయితే, ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లోని ఈ ప్రోమో ఎప్పుడు ప్రసారమైనదో తెలియరాలేదు. ప్రస్తుతమైతే.. ట్విట్టర్‌లో ఈ వీడియోను బన్నీ ఫ్యాన్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు.


Also Read: చిరంజీవి గారి కంటే నా హీరోనే బెటర్ - రాజమౌళి స్పీచ్ విన్నారా?


అమితాబ్ ‘పుష్ప’ డైలాగ్.. వైరల్ వీడియో:





 నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో అమితాబ్ బచ్చన్: