Allu Sirish Nayanika Marriage Celebrations Started : అల్లు వారింట పెళ్లి సందడి మొదలైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, యంగ్ హీరో అల్లు శిరీష్, నయనికల పెళ్లి వేడుక పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పసుపు దంచుడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను శిరీష్ షేర్ చేయగా వైరల్ అవుతోంది.

Continues below advertisement

గత నెలలోనే తన అన్న అల్లు అర్జున్‌తో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌, అత్యంత సన్నిహితుల మధ్య దుబాయ్‌లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. పార్టీలో కాబోయే దంపతులు ఫ్రెండ్స్‌తో కలిసి నేచర్ ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేశారు. ఈ ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

సాంప్రదాయబద్దంగా పసుపు దంచుడు

Continues below advertisement

సెలబ్రిటీలు ఎవరైనా పెళ్లి అనగానే హల్దీ సెలబ్రేషన్స్ పేరుతో భారీ హంగామా చేయడం చూస్తుంటాం. కానీ, అల్లు శిరీష్ మాత్రం ఇంట్లోనే సాంప్రదాయబద్దంగా పసుపు దంచిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ ఇంట్లో ఈ వేడుక గురువారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో బన్నీ సతీమణి స్నేహ, రామ్ చరణ్ సతీమణి ఉపాసన, పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. 

Also Read : ఓటీటీలోకి వచ్చేస్తోన్న విజయ్ సేతుపతి సైలెంట్ మూవీ - 'గాంధీ టాక్స్' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

మార్చి 6న వివాహం

అల్లు శిరీష్, నయనికల వివాహం మార్చి 6న జరగనుంది. గతేడాది అక్టోబరులో ఇరు కుటుంబాల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వరుణ్ తేజ్, లావణ్యల వివాహం టైంలో యంగ్ హీరో నితిన్, షాలిని దంపతులు పార్టీ ఇవ్వగా... షాలిని ప్రాణ స్నేహితురాలు నయనికను ఆహ్వానించారు. అలా నయనిక, శిరీష్ ఫస్ట్ టైం కలవగా... వీరి పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్ల తర్వాత పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు.