Urvasivo Rakshasivo Movie Update : ధీంతాననా - అనూతో అల్లు వారి అబ్బాయి పాటకు సిద్ శ్రీరామ్

Urvasivo Rakshasivo Movie First Lyrical Song Update : అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న సినిమా 'ఊర్వశివో రాక్షసివో'. ఇందులో ఫస్ట్ సాంగ్ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Continues below advertisement

అల్లు శిరీష్ (Allu Sirish) కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా సినిమా 'ఊర్వశివో రాక్షసీవో' (Urvasivo Rakshasivo Movie). ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) హీరోయిన్. థియేటర్లలోకి నవంబర్ 4న ఈ సినిమా రానుంది. ఈ మధ్య టీజర్ విడుదల చేసిన చిత్ర బృందం... త్వరలో తొలి పాటను విడుదల చేయడానికి రెడీ అయ్యింది.

Continues below advertisement

ధీంతాన... ధీంతాన!
Urvasivo Rakshasivo First Lyrical Dheemthanana : 'ఊర్వశివో రాక్షసీవో'లో తొలి పాట 'ధీంతాననా... ధీంతాననా'ను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు నేడు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందించారు. ఈ పాటను సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ (Sid Sriram) ఆలపించారు. ఆ పాట ఎలా ఉంటుందనేది 10న తెలుస్తుంది.  

శ్రీ కుమార్ పాత్రలో అల్లు శిరీష్, సింధు పాత్రలో అనూ ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ సినిమాలో సునీల్, 'వెన్నెల' కిశోర్, పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర తారాగణం. కొత్తగా ఆఫీసులో చేరిన శ్రీకి సింధు పరిచయం అవుతుంది. లిఫ్టులో ముద్దుతో మొదలైన ప్రయాణం... బెడ్ వరకు వస్తుంది. అయితే... సింధుకు శ్రీ ఐ లవ్యూ చెబితే ''అలా చెప్పడం మానేయ్. మనం మంచి స్నేహితులం మాత్రమే అనుకుంటున్నాను'' అని చెబుతుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది నవంబర్ 4న థియేటర్లలో చూడాలి. 
     
'ఊర్వశివో రాక్షసీవో' చిత్రానికి రాకేశ్ శశి (Rakesh Shashi) దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు కళ్యాణ్ దేవ్ 'విజేత' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రై.లి. పతాకంపై ధీరజ్ మొగిలినేని 'ఊర్వశివో రాక్షసీవో' నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి విజయ్ ఎం సహ నిర్మాత. తొలుత ఈ చిత్రానికి 'ప్రేమ కాదంట' టైటిల్ ఖరారు చేశారు. 'ఊర్వశివో రాక్షసీవో' అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుందని, ఈ మధ్య టైటిల్ చేంజ్ చేశారు.

'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'టాక్సీవాలా', 'ప్రతి రోజు పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌' తర్వాత GA2 పిక్చర్స్ సంస్థలో వస్తున్న చిత్రమిది. ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. మోడ్రన్ రిలేషన్షిప్స్, లవ్ నేపథ్యంలో సినిమా రూపొందింది. 

Also Read : Godfather Box Office : 'గాడ్ ఫాదర్' ఓపెనింగ్ డే వసూళ్లు ఎంత? 'బాస్ ఈజ్ బ్యాక్' అనేలా ఉన్నాయా? లేదా?

మూడేళ్ళ తర్వాత థియేటర్లలోకి వస్తున్న శిరీష్!
అల్లు శిరీష్ హీరోగా నటించిన 'ఎబిసిడి' మే, 2019లో విడుదల అయ్యింది. ఆ తర్వాత థియేటర్లలోకి మరో సినిమా రాలేదు. కరోనా కారణంగా ప్రతి సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అలా శిరీష్ జర్నీకి కొవిడ్ బ్రేకులు వేసింది. 'ఎబిసిడి'లో అల్లు శిరీష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా విడుదలైన మూడేళ్ళ తర్వాత మళ్ళీ 'ఊర్వశివో రాక్షసీవో'తో శిరీష్ థియేటర్లలోకి వస్తున్నారు.

Also Read : RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

Continues below advertisement