హైదరాబాదీలు 'అల్లు సినిమాస్' (Allu Cinemas)లో ఒక్క సినిమా అయినా చూడాలని కోరుకుంటున్నారు. అల్లు ఫ్యామిలీ ప్రెస్టీజియస్‌గా స్టార్ట్ చేసిన ఈ మల్టీప్లెక్స్‌ గురించి మంచి రివ్యూస్ వచ్చాయి. కొత్త స్క్రీన్స్, డాల్బీ సౌండ్ కావడంతో మూవీ లవర్స్ జస్ట్ అల్లు సినిమాస్ కోసం కోకాపేట వైపు అడుగులు వేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మొదలైన ఈ మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ షోస్ మొదలు అయ్యాయి. మార్చి 14, శనివారం ఓ సినిమాకు వెళ్లిన ఆడియన్స్‌కు షాక్ తగిలింది.

Continues below advertisement

'కాంచన' షోలో విజువల్స్ కట్!రాఘవా లారెన్స్ హీరోగా యాక్ట్ చెయ్యడంతో పాటు డైరెక్ట్ చేసిన 'కాంచన' రీ రిలీజ్ అయ్యిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం షో బుక్ చేసుకుని స్క్రీన్ లోపలకి వెళ్లిన ఆడియన్స్‌కు షాక్ తగిలింది. మధ్యలో విజువల్స్ కట్ అయ్యాయి. జస్ట్ ఆడియో వచ్చింది. దానితో థియేటర్లలో జనాలు గగ్గోలు పెట్టారు. గోల గోల చెయ్యడంతో కాసేపు సినిమా ఆపేసి, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. ఫైవ్ మినిట్స్ ముందు నుంచి షో వేశారు. రెండుసార్లు ఆ విధంగా జరిగిందని తెలిసింది. కొత్తగా మొదలైన 'అల్లు సినిమాస్'కు ఇదొక అపశృతి అని చెప్పాలి.

Also Read: Telugu Movie: పేమెంట్లు ఎగ్గొట్టిన ప్రొడ్యూసర్... అమెరికాకు పరార్ - స్పోర్ట్స్‌ బయోపిక్‌ ఇష్యూ తెల్సా? టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల షో మధ్యలో విజువల్స్ లేదా ఆడియో కట్ అవ్వడం, మళ్ళీ దాన్ని సెట్ చేసి ప్లే చెయ్యడం సాధారణంగా జరుగుతుంది. గతంలో ప్రసాద్ మల్టీప్లెక్స్ సహా కొన్ని స్క్రీన్లలో ఆ విధంగా జరిగింది కూడా. అది టెక్నికల్ గ్లిట్జ్ తప్ప థియేటర్ ప్రాబ్లమ్ కాదు. 

Continues below advertisement

Also ReadChinmayi Sripada: కమల్, రజనీపై చిన్మయి విమర్శలు... లైంగిక వేధింపులు చేసిన వ్యక్తిని ప్రశంసిస్తారా?

ఇప్పటి వరకు 'అల్లు సినిమాస్'కు వెళ్లిన ఆడియన్స్ నుంచి మంచి రివ్యూస్ వచ్చాయి. సౌండ్, విజువల్ క్వాలిటీ బావుందని చెబుతున్నారు. సో ఫ్యూచర్‌లో మూవీ లవర్స్ ఈ మల్టీప్లెక్స్‌కు క్యూ కట్టే ఛాన్సులు ఉన్నాయి.

Also ReadJason Sanjay: దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?