Allu Arjun Review On Ranveer Singh Dhurandhar Movie : బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, మలయాళ స్టార్ ఆర్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మూవీని చూసి రణవీర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.
ధురంధర్... ఎక్స్‌ట్రార్డినరీ
'ధురంధర్'లో రణవీర్ యాక్టింగ్ అద్భుతమని... అత్యుత్తమ సాంకేతిక విలువలతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారని అల్లు అర్జున్ కొనియాడారు. సోషల్ మీడియా వేదికగా రివ్యూ ఇచ్చారు. 'ధురంధర్ మూవీని ఇప్పుడే చూశా. అద్భుతమైన ప్రదర్శన, అత్యుత్తమ సాంకేతిక అంశాలు, సౌండ్ ట్రాక్స్‌తో నిర్మించిన చిత్రం ఇది. రణవీర్ తన నటనతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు.
అలాగే అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ తమ తమ పాత్రల్లో మెప్పించారు. ధురంధర్ మూవీ టీం, టెక్నికల్ టీంకు నా అభినందనలు. మూవీని డైరెక్టర్ ఆదిత్య ధర్ ఫుల్ స్వాగ్‌తో అద్భుతంగా రూపొందించారు. ఈ మూవీ నాకు చాలా నచ్చింది. ధురంధర్‌ను ఆస్వాదించండి గాయ్స్.' అంటూ ట్వీట్ చేశారు.
Also Read : లేడీ ఓరియెంటెడ్ మూవీలో భాగ్యశ్రీ - రాజేంద్ర ప్రసాద్ మూవీ ఫేమస్ సాంగ్ లిరిక్ టైటిల్‌గా...
ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా... రణవీర్‌తో పాటు బాలీవుడ్ హీరోస్ అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మలయాళ స్టార్ ఆర్ మాధవన్, సారా అర్జున్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత 3 గంటల 34 నిమిషాల రన్ టైంతో ఎక్కువ నిడివి ఉన్న సినిమాగా 'ధురంధర్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ 3 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. వారం రోజుల్లో రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు మూవీ టీం వెల్లడించింది.
6 దేశాల్లో బ్యాన్
అయితే, 6 దేశాల్లో 'ధురంధర్' మూవీని బ్యాన్ చేశారు. గల్ఫ్ దేశాల్లో ఈ మూవీ రిలీజ్‌ను అడ్డుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బహ్రెయిన్, ఒమన్, కువైట్, సౌదీ అరేబియాతో పాటు ఖతార్, యూఏఈలోనూ సినిమా విడుదల కానట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌కు కీలక మార్కెట్ అయిన గల్ఫ్‌లోని అన్నీ థియేటర్లలోనూ దీన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కొన్ని చోట్ల అనుమతులు లభించనట్లు తెలుస్తోంది. పాక్‌కు వ్యతిరేకంగా మూవీ ఉండడంతోనే ఆయా దేశాలు ఈ సినిమాను అక్కడ బ్యాన్ చేసినట్లు సమాచారం. దాయాది దేశంలో ఉగ్ర సంస్థల్ని అరికట్టేందుకు 'ధురంధర్' పేరుతో భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ చేసిన ఆపరేషన్ ఈ మూవీ స్టోరీ.