'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు 'పుష్ప పార్ట్ 2' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ తో బన్నీ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ మూవీ తో పాటు ఓ బాలీవుడ్ మూవీ కూడా బన్నీ చేయాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం బన్నీ ఆ బాలీవుడ్ ప్రాజెక్టుకు నో చెప్పారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ లో 'ఉరి ది సర్జికల్ స్ట్రైక్' సినిమాని తెరకెక్కించిన బడా డైరెక్టర్ ఆదిత్యధర్ తాజాగా 'ది ఇమ్మార్టెల్ అశ్వద్ధామ' అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. విక్కీ కౌశల్ హీరోగా ఈ సినిమాని మేకర్స్ ముందు అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత అతని ప్లేస్ లో రణవీర్ సింగ్ పేరు కూడా వినిపించింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టులో బన్నీ మెయిన్ లీడ్ గా నటిస్తున్నారని వార్త బయటకు వచ్చింది.


బన్నీకి స్టోరీ కూడా బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. ఇక డైరెక్టర్ ఆదిత్యధర్ డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఇదే కావడంతో.. హై టెక్నికల్ వాల్యూస్ గ్రాండ్ ఇయర్ విఎఫ్ఎక్స్ తో ఈ సినిమాని ఆదిత్యధర్ ప్లాన్ చేశారు. అయితే ఏమైందో తెలియదు కానీ తాజాగా అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ కెరియర్ పీక్ స్టేజ్ లో ఉంది. అందుకే ఇలాంటి టైంలో రిస్కు తీసుకోవాలని అనుకోవడం లేదట. దాంతో 'ఇమ్మో ర్టల్ అశ్వద్ధామ' ప్రాజెక్టుకి బన్నీ నో చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.


లేటెస్ట్ బాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ ప్రాజెక్టు కోసం బన్నీని సంప్రదించినప్పుడు ఈ ప్రాజెక్టుని ఓకే చేయడానికి తనకు సమయం కావాలని అన్నారట. ఈ ప్రాజెక్టు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని అందుకు కొంత సమయం అడగడంతో మేకర్స్ బన్నీ రిప్లై కోసం ఇన్ని రోజులుగా ఎదురు చూశారు. అయితే రిస్క్ చేయడం ఇష్టం లేక బన్నీ తాజాగా మేకర్స్ కి నో చెప్పేశాడని అంటున్నారు. 'పుష్ప' సక్సెస్ తర్వాత బన్నీ కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక బన్నీ ఈ ప్రాజెక్టు ను రిజెక్ట్ చేయడంతో మళ్లీ విక్కీ కౌశల్ పేరుని మేకర్స్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.


ఇక 'ఇమ్మోర్టల్ అశ్వద్ధామ' ప్రాజెక్టు విషయానికి వస్తే.. హిందూ ఇతిహాసం మహాభారతంలోని అశ్వద్ధామ కథ ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు దర్శకుడు ఆదిత్య ధర్. మొదట ఈ ప్రాజెక్టు కోసం విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ ని ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత విక్కీ కౌశల్ ప్లేస్ లో రణవీర్ సింగ్ పేరు వినిపించింది. అలాగే సారా అలీ ఖాన్ రీప్లేస్ చేస్తూ సమంతను అనుకున్నారు. ఇక రణవీర్ సింగ్ తర్వాత ఎన్టీఆర్, కేజిఎఫ్ హీరో యశ్ పేర్లు కూడా వినిపించాయి. వాళ్లు కూడా సూపర్ హీరో కథలపై ఆసక్తి చూపించకపోవడంతో అల్లు అర్జున్ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు బన్నీ కూడా నో చెప్పడంతో ఈ ప్రాజెక్టు ఏ హీరో దగ్గరికి వెళ్తుందో చూడాలి. మరోవైపు నటీనటుల ఎంపిక , ఇతర సాంకేతిక కారణాలవల్ల ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఈ సినిమా ఏకంగా రూ.30 కోట్ల నష్టాన్ని చవి చూసింది. జియో స్టూడియోస్ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించబోతోంది.


Also Read : 'పుష్ప2' నుంచి ఫహాద్ ఫజిల్ లుక్ వచ్చేసింది - మాస్ అవతార్‌లో టెర్రర్ పుట్టిస్తోన్న షెకావత్ సార్!






Join Us on Telegram: https://t.me/abpdesamofficial