Allu Arjun Look Fierce Clawed Avatar In Raaka Movie : తోడేలు వంటి చేయి... అరగుండుతో ఐకాన్ స్టార్. ఫస్ట్ టైం ఇలా ఆయన్ను చూస్తే ఎవరైనా కొంచెం భయపడాల్సిందే. తాజాగా అల్లు అర్జున్, అట్లీ మూవీ 'రాకా'లో బన్నీ లుక్ నిజంగా ఫెరోసియస్‌గా న్యూ అవతార్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 

Continues below advertisement

నెగిటివ్ రోల్ లుక్ ఇదేనా!

అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్‌గా అట్లీ మూవీ నుంచి వచ్చిన ఈ బిగ్ సర్ప్రైజ్ ఫ్యాన్స్‌కు నిజంగా బిగ్ ట్రీట్ అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ లుక్‌లో బన్నీ అదరగొట్టారు. ఈ న్యూ అవతార్‌కు ఫిదా అయిపోయారు. గతంలో పుష్ప ప్రాంఛైజీలో వచ్చిన అమ్మవారి లుక్‌తో ఆయన చేసిన డ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. అంతకు మించిన స్థాయిలో లేటెస్ట్ లుక్ ఉండడంతో అందరిలోనూ మూవీపై హైప్ మామూలుగా లేదు.

Continues below advertisement

సమాంతర ప్రపంచం, పునర్జన్మల కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు ప్రచారం సాగుతుండగా... త్రీ డిఫరెంట్ జనరేషన్స్‌లో మూడు డిఫరెంట్ రోల్స్‌లో బన్నీ నటించబోతున్నారంటూ ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. ఆ రోల్స్‌లో నెగిటివ్ రోల్‌కు సంబంధించిన లుక్ ఇదే అయి ఉంటుందంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. సూపర్ పవర్స్‌తో నెగిటివ్ స్వభావం ఉన్న రోల్ అని ఊహిస్తున్నారు. మొత్తానికి ఫస్ట్ లుక్‌తోనే దర్శక నిర్మాతలు ఓ డార్క్ ఎపిక్ టోన్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్

ఇక టైటిల్ విషయానికొస్తే... గతంలో ఐకాన్, వైల్డ్ ఫైర్, అయాన్, స్పార్క్, లెగసీ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయంటూ రూమర్స్ వచ్చినా... ఎవరూ ఊహించని విధంగా ఓ సరికొత్త టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. కేవలం ఫస్ట్ లుక్‌లోనే... 'పరిమితులను దాటి ఓ విజన్‌ను చూసేందుకు మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి' అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో రాబోయే రోజుల్లో వచ్చే లుక్స్ కానీ, అప్డేట్స్ కానీ అంచనాలను  మించి ఉండబోతున్నాయని అర్థమవుతోంది.

ఈ ప్రాజెక్ట్ గురించి రీసెంట్‌గా డైరెక్టర్ అట్లీ ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ... 'ఈ మూవీతో ఆడియన్స్‌కు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి మేం ప్రయత్నిస్తున్నాం. ఏదైనా ఒక్క ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం.' అని చెప్పారు. దీన్ని బట్టే ఎలాంటి కాన్సెప్ట్‌ను తెరకెక్కించనున్నారనేది అర్థమవుతోంది. హాలీవుడ్ రేంజ్‌లో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఉండనున్నాయి.

మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ నటిస్తుండగా... మృణాల్, జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. నేషనల్ క్రష్ రష్మిక నెగిటివ్ రోల్‌లో నటించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు మొత్తం 7 భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.