Allu Arjun Chief Guest For Thandel Event: నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ఈమూవీ 'తండేల్'. కార్తికేయ 2 ఫేం చందు మొండేటి దర్శకత్వంతో ఈ సినిమా రూపొందుతోంది. మరికొన్నిరోజులు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ స్పీడు పెంచింది. ఇప్పటికే విడుదల తండేల్ ప్రచార పోస్టర్స్ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని బుజ్జితల్లి పాట విశేష ఆదరణ అందుకుంది. ఈ సాంగ్ హిట్‌తో మూవీపై అంచనాలు ఒక్కసారి పెరిగిపోయాయి. ఇక ఆ తర్వాత విడుదలైన మహా శివరాత్రి, హైలెస్సో పాటలకు సైతం మంచి ఆదరణ దక్కింది. ఈ క్రమంలో రీసెంట్ విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత బజ్ పెంచింది. దీంతో రోజురోజుకు తండేల్‌పై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.
ఇక సినిమాకు ఇంకా కొన్ని రోజులే టైం ఉంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తండేల్ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని భారీగా ప్లాన్ చేసింది మూవీ టీం. ఫిబ్రవరి 1న హైదరాబాద్ ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున్న ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం పుష్పరాజ్‌ని రంగంలోకి దింపింది తండేల్ టీం. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈ మేరకు మూవీ టీం ఓ ప్రకటన విడుదల చేసింది. తండేల్ రాజ్ కోసం పుష్పరాజ్ అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 1వ తేదిన సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌లో తండేల్ జాతర ఉండనుందని మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ అల్లు అర్జున్స్ చీఫ్ గెస్ట్ వస్తున్నాడని తెలిసి అక్కినేని, అల్లు ఫ్యామిలీ అంత పండగ చేసుకుంటుంది. ఈ దెబ్బతో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
కాగా లవ్‌స్టోరీ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కేమిస్ట్రీకి వందకు వందశాతం మార్కులు పడ్డాయి. ఈ క్రేజీ కాంబో తండేల్‌కి జతకట్టడంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, ట్రైలర్‌లో సాయి పల్లవి, నాగ చైతన్య కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈసారి వీరిద్దరి ప్రేమకథకు దేశభక్తి కూడా జతకావడంతో ఆన్‌స్క్రీన్‌పై మరోసారి వీరి కేమిస్ట్రీని చూసేందుకు అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్‌గా పలు భాషల్లో విడుదల కాబోతోంది.
తండేల్ కథ విషయానికి వస్తే
2018లోని యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినమాను తెరకెక్కించాడు చందు మొండేటి. శ్రీకాకుళంలోని చెందిన మత్స్యకారుడైన యువకుడి కథ ఆధారంగా తండేల్‌ని రూపొందింది. శ్రీకాకుళం కోస్టల్ ఏరియాకు చెందిన రాజు అనే జాలరి చేపల వేటకు వెళ్లి పొరపాటున పాకిస్థాన్ సముద్రజాలాల్లోకి ప్రవేశిస్తాడు. దీంతో పాక్ నేవి అధికారులు అతడిని అరెస్ట్ చేసి చిత్రహింసలు గురిస్తారు. ఈ క్రమంలో అతడిని వారి నుంచి విడిపించేందుకు రాజు ప్రియురాలు ఏం చేసిందనే సినిమా కథ. ఈ ఇంటెన్స్ లవ్‌స్టోరీకి దేశభక్తిని కూడా జత చేసి అద్భుతమైన ప్రేమకథ ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాడు దర్శకుడు.