మార్చి 13ను తెలుగు సినిమా చరిత్ర ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. అమెరికా టైమింగ్స్ ప్రకారం మార్చి 12 సాయంత్రం కావచ్చు. కానీ, మనకు మార్చి 13 తెల్లవారుజామున కదా! 'నాటు నాటు...' పాటకు (Naatu Naatu Won Oscar) ఆస్కార్ రావడంతో ఇండస్ట్రీ జనాలు ఆనందంలో మునిగి తేలారు. నిజం చెప్పాలంటే...  చాలా మంది తెల్లవారుజామున నిద్రలేచి టీవీలకు, ఓటీటీలకు అతుక్కుపోయారు.


'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' విభాగంలో 'నాటు నాటు...'కు ఆస్కార్ అని అనౌన్స్ చేసిన మరుక్షణమే సంబరాలు చేసుకున్నారు. తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'ఆర్ఆర్ఆర్'లో పాటకు వచ్చిన ఆస్కార్ తమకు వచ్చిందన్నట్టు చాలా హ్యాపీగా రియాక్ట్ అయ్యారు. 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెజారిటీ జనాలు అందరూ సోమవారమే 'ఆర్ఆర్ఆర్' టీంకు విషెష్ చెప్పారు. అల్లు అర్జున్ మాత్రం ఒక్క రోజు ఆలస్యంగా చెప్పారు. 


ఇండియాకు ఇది బిగ్ మూమెంట్!
''భారత దేశం గర్వించదగ్గ క్షణాలు ఇవి. ఇండియాకు ఇది బిగ్ మూమెంట్. ఆస్కార్స్ వేదికపై తెలుగు పాట షేక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ సినిమాకు ఇది హార్ట్ టచింగ్ మూమెంట్'' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. సంగీతం అందించిన కీరవాణి, పాట రాసిన చంద్రబోస్, పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవలకు కంగ్రాట్స్ చెప్పారు. రామ్ చరణ్ (Ram Charan)ను లవ్లీ బ్రదర్ అని సంభోదించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల గర్వకారణం అని పేర్కొన్నారు. వాళ్ళిద్దరూ తమ స్టెప్పులతో ప్రపంచమంతా డ్యాన్స్ చేసేలా చేశారని పేర్కొన్నారు. దీనంతటికీ కారణం రాజమౌళి అని, ఆయన వల్ల ఈ మేజిక్ క్రియేట్ అయ్యిందని అల్లు అర్జున్ అభినందించారు. 






ఎందుకు లేటుగా చెప్పారు?
'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ వచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ స్పందించకపోవడం చర్చనీయాంశం అయ్యింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్... సీనియర్ స్టార్ హీరోలతో పాటు పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు వంటి ఈతరం స్టార్స్ సైతం 'నాటు నాటు...'కు ఆస్కార్ రావడం పట్ల సోమవారమే తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలుగు చిత్రసీమలో చిన్న, పెద్ద వ్యత్యాసం లేకుండా హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. దాంతో అల్లు అర్జున్ సోమవారం తన స్పందన ఎందుకు తెలుపలేదు? అనేది డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఆయన మీద నెగిటివ్ పోస్టులు కూడా వచ్చాయి. ఆ తర్వాత ట్వీట్ చేశారు. 


Also Read : బాలకృష్ణ ఒక్కరే మా కుటుంబం - తారకరత్న భార్య సెన్సేషనల్ పోస్ట్


అల్లు అర్జున్ ఇప్పుడు 'పుష్ప 2' చిత్రీకరణ చేస్తున్నారు. హైదరాబాదులోనే సినిమా షూటింగ్ జరుగుతోంది. చిత్రీకరణలో బిజీగా ఉండటంతో ఆస్కార్ వచ్చిన విషయం ఆయనకు తెలియలేదని అనుకోవడానికి వీల్లేదు. 'పుష్ప 2' దర్శకుడు సుకుమార్ సైతం కీరవాణి, చంద్రబోస్, రాజమౌళితో పాటు 'ఆర్ఆర్ఆర్' సినిమా బృందానికి అభినందనలు తెలిపారు. వేదిక మీద ఆస్కార్ అందుకున్న వ్యక్తుల్లో ఒకరైన చంద్రబోస్ 'పుష్ప'లో అద్భుతమైన పాటలు రాశారు. 'పుష్ప 2'కు కూడా ఆయన పని చేస్తున్నారు. అందువల్ల, సోమవారం బన్నీకి ఆస్కార్ వచ్చిన విషయం తెలియలేదని అనుకోవడానికి వీల్లేదని నెటిజనులు భావిస్తున్నారు. 


Also Read : అందాల రాక్షసి ట్విట్టర్ హ్యాక్ చేసిన ఫారినర్