తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఐక్యత గురించి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదేనని ఆయన నర్మ గర్భంగా వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డులలో తెలుగు సినిమాలకు ఏడు పురస్కారాలతో పాటు మరో ఇద్దరు తెలుగు వ్యక్తులు అవార్డులు అందుకున్నప్పటికీ... విజేతలను సత్కరించకపోవడంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

జాతీయ అవార్డులు వస్తే పండుగలా జరుపుకోవాలి!దుబాయ్ వేదికగా వచ్చే నెల (సెప్టెంబర్) 5, 6వ‌ తేదీలలో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీలో గురువారం ఏర్పాటు చేసిన ఒక విలేకరుల సమావేశంలో జాతీయ పురస్కార విజేతలను సత్కరించారు. ఆ వేదికపై అల్లు అరవింద్ మాట్లాడుతూ... ''జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలకు ఏడు వచ్చాయి. సైమా స్పందించి ఆ విజేతలను సత్కరించడం అభినందనీయం. జాతీయ పురస్కారాల పట్ల మన పరిశ్రమ స్పందించలేదు. జాతీయ అవార్డులు వచ్చినప్పుడు ఒక పండుగగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మనకు తెలిసిందే కదా ఇక్కడ ఎవరి కుంపటి వారిది'' అని అన్నారు.

Also Read'కూలీ'లో విలన్‌గా సర్‌ప్రైజ్ చేసిన హీరోయిన్... మహానటిని మించిన అపరిచితురాలు - ఎవరీ రచితా రామ్?

నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'భగవంత్ కేసరి' ఉత్తమ తెలుగు సినిమాగా అవార్డు అందుకోగా...‌ 'బేబీ' చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా దర్శకుడు సాయి రాజేష్, ఆ సినిమాలో 'ప్రేమిస్తున్నా' పాటకు గాయకుడు రోహిత్ తదితరులు విజేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే. వాళ్లను సైమా సత్కరించింది.

Also Readకూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?