Allari Naresh 60: మళ్ళీ 'నాంది' దర్శకుడితో - మరోసారి ఖైదీగా 'అల్లరి' నరేష్

Allari Naresh 60th movie in the direction of Vijay Kanakamedala announced today: 'నాంది' సినిమా హీరో, దర్శకుడు కలిసి మరో సినిమా చేయనున్నారు.

Continues below advertisement

Naresh Vijay 2: 'నాంది'... హీరో 'అల్లరి' నరేష్ కెరీర్‌లో ఒక మైలురాయి. చాలా సంవత్సరాల తర్వాత ఆయనకు విజయం అందించిన చిత్రమిది. అంతే కాదు... వినోదం మాత్రమే కాదు, నరేష్‌లో దాగి ఉన్న నటుడిని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సినిమా. ఆ చిత్రంతో విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది.

Continues below advertisement

'నాంది' విజయం తర్వాత 'అల్లరి' నరేష్, విజయ్ కనకమేడల కలిసి మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇది హీరోగా నరేష్ 60వ సినిమా కాగా... విజయ్ కనకమేడలతో రెండో సినిమా. ఈ రోజు అధికారికంగా సినిమాను అనౌన్స్ చేశారు.

Also Read : చిరంజీవి, పవన్ కళ్యాణ్... ఇద్దర్నీ 'రంగ రంగ వైభవంగా' టీజ‌ర్‌లో చూపించిన వైష్ణవ్ తేజ్

Allari Naresh as Prisoner again: నరేష్, విజయ్ రెండో సినిమా అనౌన్స్‌మెంట్‌ పోస్టర్ చూస్తే... మరోసారి నరేష్ ఖైదీగా కనిపించనున్నారని అర్థం అవుతోంది. 'నాంది'లో ఆయన అండర్ ట్రయిల్ ఖైదీగా... చేయని తప్పుకు జైల్లో మగ్గుతున్న మనిషిగా కనిపించిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. ప్రస్తుతం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాలో 'అల్లరి' నరేష్ నటిస్తున్నారు. దాని తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 

Also Read : ప్రియాంకతో ఉన్నది బాయ్‌ఫ్రెండేనా - అమ్మ అడగడంతో అసలు విషయం చెప్పిన హీరోయిన్

Continues below advertisement