Allari Naresh's Alcohol Movie Teaser Out: ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌కు ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ అందించే యంగ్ హీరో అల్లరి నరేష్ మరో కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. 'ఆల్కహాల్' అనే డిఫరెంట్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతుండగా... తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది.
'ఆల్కహాల్' కంట్రోల్ చేస్తుందా?
ఈ మూవీలో ఆల్కహాల్ కీ ఎలిమెంట్ అని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. 'లక్షలు లక్షలు సంపాదిస్తావ్. మందు తాగవ్. ఇంకెందుకు రా నీ బతుకు.' అంటూ కమెడియన్ సత్య డైలాగ్‌తో టీజర్ ప్రారంభం కాగా... 'తాగుడుకు సంపాదనకు లింక్ ఏముంది సార్?. అయినా తాగితే మన మీద మనకు కంట్రోల్ ఉండదు సార్. నన్ను ఆల్కహాల్ కంట్రోల్ చేయడం నాకు ఇష్టం ఉండదు.' అంటూ నరేష్ సత్యను సీరియస్ మోడ్‌లో కామెడీగా చిక్కొట్టడం నవ్వులు పూయిస్తోంది. లిక్కర్ ఓ వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఈ మూవీలో చూపించనున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది.
Also Read: ఘోస్ట్ వాక్ టూర్ గైడ్ to దెయ్యం... 'కిష్కింధపురి'లో హీరోయిన్ అనుపమ రోల్ ఇదే
మందు తాగితే...
ఓ వ్యక్తి మందు తాగిన తర్వాత తాగక ముందు అతని ప్రవర్తన దాని వల్ల జరిగే సంఘటనల ఆధారంగా మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మూవీలో నరేష్ వింటేజ్ లుక్ ఆకట్టుకుంటోంది. కామెడీ ఎంటర్‌టైనర్‌లో నరేష్ కంప్లీట్ న్యూ లుక్ మూవీపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీకి 'ఫ్యామిలీ డ్రామా' ఫేం మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తుండగా... నరేష్ సరసన రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటు నిహారిక ఎన్ఎం, సత్య, గిరీష్ కులకర్ణి, చైతన్య కృష్ణ, హర్షవర్దన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తుండగా... చేతన్ భరద్వాజ్ నేపథ్యం సంగీతం అందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు.
న్యూ ఇయర్ కానుకగా...
ఈ మూవీని న్యూ ఇయర్ కానుకగా వచ్చే ఏడాది జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. కమెడియన్ సత్య, అల్లరి నరేష్ కాంబోలో డిఫరెంట్ కామెడీ థ్రిల్లింగ్ డ్రామా భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా... అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Alcohol Cast And Crew: నటీనటులు: అల్లరి నరేష్, రుహాని శర్మ, నిహారిక ఎన్.ఎం., సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, వెంకటేష్ కాకుమాను, కిరీటి, రచన, దర్శకత్వం: మెహర్ తేజ్, సంగీతం: గిబ్రాన్, ఛాయాగ్రహణం: జిజు సన్నీ, కూర్పు: నిరంజన్ దేవరమానే, ఆర్ట్ డైరెక్టర్: విశాల్ అబానీ, కో రైటర్: ఉద్భవ్ రఘునందన్, కో ప్రొడ్యూసర్ - వెంకట్ ఉప్పుటూరి, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యనిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్.