Allari Naresh Aa Okkati Adakku Teaser: అల్లరి నరేష్ మళ్లీ ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అయ్యాడు. అంతకుముందు బ్యాక్ టూ బ్యాక్ కామెడీ చిత్రాలతో అలరించిన నరేష్ తన రూటు మార్చాడు. 'నాంది', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', 'ఉగ్రం' వంటి సీరియస్ జానర్లతో వచ్చి హిట్ కూడా కొట్టాడు. 'నా సామి రంగ'లో ప్రేక్షకులకు వింటేజ్ నరేష్ కనిపించారు. అయితే, ఆ క్యారెక్టర్ ఎండింగ్ కొందరికి నచ్చలేదు. అయితే, ఇప్పుడు మళ్లీ ఈ అల్లరోడు బ్యాక్ అంటూ ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో మళ్లీ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. అతడి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటి అడక్కు' సినిమా. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్, ఫస్ట్‌లుక్ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ క్రమంలో మూవీపై మరింత హైప్ పెంచేందుకు తాజాగా సినిమా టీజర్ వదిలారు మేకర్స్.
టీజర్ ఎలా ఉందంటే..
ప్రస్తుతం టీజర్ సినీ ప్రీయులను బాగా ఆకట్టుకుంటుంది. టీజర్ ఎలా ఉందంటే.. టీజర్ ఎలా ఉందంటే.. ఇందులో హీరోది పెళ్లి కోసం ఆరాటపడే యువకుడి క్యారెక్టర్ అని మేకర్స్ ఇదివరకు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అదే టీజర్‌లో చూపించారు. హీరో పెళ్లి సమస్యతోనే టీజర్ మొదలైంది. 25 రోజుల 10 గంటల 5 నిమిషాల్లోగా పెళ్లి జరగాలని, లేకపోతే అతడు జన్మంతా బ్రహ్మాచారిగానే ఉండిపోతాడంటూ జ్యోతిష్యుడు చేప్పే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ఆ తర్వాత పెళ్లెప్పుడు.. పెళ్లెప్పుడు అంటూ హీరోని అంతా అడిగి ఇబ్బంది పెడుతుంటారు. మరోవైపు జ్యోతిష్యుడు చెప్పే గడువులోపు హీరోకి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుంటారు. ఇందు కోసం మ్యారేజ్ బ్యూరోకు కూడా వెళతారు.
అయినా అతడికి సంబంధాలు కుదరకపోవడం, జాతకం ప్రకారం 25 రోజుల్లోగా పెళ్లి చేసేందుకు నరేష్ ఫ్యామిలీ చేసే ప్రయత్నం, ఈ క్రమంలో అతడికి హీరోయిన్ ఫరియా పరిచయం అవ్వడం, ఇద్దరి మధ్య పరిచయం, ప్రేమను ఇలా టీజర్‌లో ఆసక్తిగా చూపించారు. అంతా బాగుందని అనుకుంటుండుగా.. హీరో, హీరోయిన్‌తో పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆమె 'ఆ ఒక్కటి అడక్కు' అంటూ ట్విస్ట్ ఇస్తుంది. దీంతో నరేష్ కన్‌ఫ్యూజ్‌లో పడిపోతాడు. ఆ తర్వాత నరేఎనష్ అమ్మ ఒకసారి రజిత ఆంటీని చూడటానికి వెళ్లమందంటూ సిగ్గు పడుతూ చెబుతాడు. దాంతో వెన్నెల కిషోర్ చివరికి అమ్మాయిలను వదిలేసి ఆంటీల వెనకపడ్డారా? అని అనడంతో నరేష్ సోదరి క్యారెక్టర్ ఎవరైతే ఏంటీ.. పెళ్లయితే అదే పదివేలు అంటుంది. అలా అమాంతం టీజర్ ఫుల్ కామెడీగా సాగింది. ఇక టీజర్‌లో ఫరియా ఇచ్చిన ట్విస్ట్ మూవీపై ఆసక్తిని పెంచుతుంది.
మూవీ రిలీజ్ ఎప్పుడంటే..
'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రాన్ని మార్చి 22న థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు టైటిల్ గ్లింప్స్ విడుదల చేసినప్పుడు తెలిపారు. ఈ చిత్రానికి కళా దర్శకుడు: జేకే మూర్తి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అక్షిత అక్కి, కూర్పు: ఛోటా కె ప్రసాద్, ఛాయాగ్రహణం: సూర్య, రచన: అబ్బూరి రవి, సంగీతం: గోపి సుందర్, సహ నిర్మాత: భరత్ లక్ష్మీపతి, నిర్మాత: రాజీవ్ చిలక, దర్శకత్వం: మల్లి అంకం.