బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, ఆలియా భట్‌పై అభిమానుల ఫోకస్ ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లి జరిగినప్పటి నుంచి వీరిద్దరు కలిసి బయటికొచ్చినా లేదా ఒకరి గురించి ఒకరు మాట్లాడినా సెన్సేషనే అవుతోంది. తాజాగా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆలియా భట్.. రణబీర్ ఒకసారి తన లిప్‌స్టిక్‌ను పూర్తిగా తుడిచేయమన్నాడని ఆసక్తికర కామెంట్స్ చేసింది. కానీ తను చేసిన కామెంట్స్ వల్ల రణబీర్ చాలా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆలియా ఈ కామెంట్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యింది.
సీరియస్‌గా మారిన సరదా కామెంట్..
రణబీర్ కపూర్.. ఆలియా భట్‌ను పెళ్లి చేసుకోవడం కంటే ముందు చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లోనే తన టాప్ తారలను డేట్ చేశాడు. అసలు వారితో రణబీర్ ఎందుకు విడిపోయాడో పూర్తిగా క్లారిటీ లేకపోయినా.. చాలామంది బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఇప్పటికీ రణబీర్‌దే తప్పు అన్నట్టుగా విమర్శిస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఆలియా పెళ్లి చేసుకోవడం ఏంటి ఓపెన్‌గా కామెంట్స్ కూడా చేస్తుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే రణబీర్ ఒక రెడ్ ఫ్లాగ్ అని చాలామంది ముద్ర వేసేశారు. ఇదే క్రమంలో ఆలియా చేసిన సరదా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన భర్త రణబీర్ ఒకసారి తన లిప్‌స్టిక్‌ను తుడిచేసుకోమన్నాడని, ఎందుకంటే తనకు ఆలియా నేచురల్ లిప్ కలర్ ఇష్టమని చెప్పాడని ఆలియా తెలిపింది. ఒక భార్యగా తను ఈ విషయాన్ని సరదాగానే అందరితో షేర్ చేసుకుంది. కానీ కొంతమంది మాత్రం రణబీర్ చాలా కంట్రోలింగ్ అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
పట్టించుకునే టైమ్ లేదు..
రణబీర్‌పై తను చేసిన సరదా కామెంట్స్ సీరియస్‌గా మారిన విషయం ఆలియా వరకు వెళ్లింది. అందుకే నెటిజన్లు చేస్తున్న కాంట్రవర్సీలకు ఫుల్‌స్టాప్ పెట్టాలనుకుంది. హ్యాపీ ఫేస్‌తో ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి క్యాప్షన్‌గా ‘మాటల్లేవ్.. వైబ్స్ మాత్రమే’ అంటూ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇది చూసిన రణబీర్, ఆలియా ఫ్యాన్స్.. ఒక్కమాటతో కాంట్రవర్సీకి ఎండ్ చెప్పాలని చూసింది అని అంటున్నారు. ఈ ఫోటోల్లో ఆలియా చాలా క్యూట్‌గా కనిపిస్తుంది అంటూ ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’లో ఆలియాతో జతకట్టిన రణవీర్ సింగ్ సైతం ఈ పోస్ట్‌కు ‘వైబ్స్’ అని కామెంట్ పెట్టాడు. ఇక ప్రస్తుతం ఆలియా.. తనపై, తన భర్తపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌ను పట్టించుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేదు. ఎందుకంటే తను నటించిన సినిమా ప్రమోషన్స్, నటించబోతున్న మూవీలతోనే తను చాలా బిజీగా ఉంది. తాజాగా విడుదలయిన ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ కూడా కలెక్షన్స్ విషయంలో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది.
Also Read: రేణూ దేశాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు - ఆ కామెంట్స్ చేసిన టీవీ చానెల్ ఉద్యోగిపై వేటు?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial