'ఫైటర్'తో తనకంటూ బాలీవుడ్‌లో ఓ స్థానాన్ని సంపాదించుకున్న నటుడు అక్షయ్ ఒబెరాయ్ (Akshay Oberoi). బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న అక్షయ్... ఇప్పుడు దక్షిణాది సినిమాలపై కన్నేశాడు. అతడికి సౌత్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. అందులో భాగంగా కన్నడ సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమాలో అవకాశం వచ్చింది. తొలిసారి దక్షిణాదిన అడుగుపెట్టబోతున్న ఈ స్టార్ నటుడిపైనే అందరి దృష్టి ఉన్నది.
'టాక్సిక్' సినిమాలో అక్షయ్ ఒబెరాయ్ లీడ్ రోల్ చేస్తున్నాడనే విషయం బయటకు రావడంతో అతడి మీద సౌత్ ఇండస్ట్రీ చూపు పడింది. ఇప్పటికే యశ్ (Rocking Star Yash) 'కేజీఎఫ్' పార్ట్ 1, పార్ట్ 2తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. బాలీవుడ్ ఆడియన్స్ కూడా అతడి సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఉత్తరాది హీరోలు, స్టార్ నటులు కూడా దక్షిణాది చిత్రాల్లో మెరుస్తున్నారు.
Akshay Oberoi In Toxic Movie: అక్షయ్ ఒబెరాయ్ పాత్రకు సంబంధించిన ఓ చిన్న ఫొటో ఇటీవలే సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. అక్షయ్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూ యూనిట్ ఓ లేఖను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ లేఖ హాట్ టాపిక్‌గా మారింది. డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరిగే కథతో తెరకెక్కుతున్న 'టాక్సిక్'లో యష్‌తో సమానమైన పాత్రను అక్షయ్ పోషించబోతున్నాడు. ఇప్పటికే అక్షయ్ బెంగళూరులో ల్యాండయినట్టుగా సమాచారం.
'టాక్సిక్' (Toxic Movie) షూటింగ్ పార్ట్‌లో కూడా ఆయన పాల్గొన్నారని తెలుస్తోంది. బాలీవుడ్ చిత్రాలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ అక్షయ్ తగిన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి పాత్ర ఇచ్చినా అవలీలగా, గుర్తుండిపోయే విధంగా నటింగల దిట్ట అక్షయ్. అందులో ఎలాంటి సందేహం లేదు. 'టాక్సిక్'లో అక్షయ్ పాత్ర ఖచ్చితంగా గుర్తుండిపోయే విధంగా ఉంటుందని కన్నడ సినీ వర్గాలు చెబుతున్నారు.
Also Read:
'ఫైటర్' సినిమా ద్వారా అక్షయ్ ఒబెరాయ్ ఎంతటి గుర్తింపు తెచ్చుకున్నారో... దానికి ఏమాత్రం తగ్గకుండా 'టాక్సిక్' పాత్ర ఉంటుందని సినీ వర్గాలు టాక్. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
యశ్ రెండు భారీ హిట్లు తరువాత చేస్తున్న సినిమా కావడం ఒక ఎత్తు అయితే, 'ఫైటర్' తరువాత తొలిసారిగా దక్షిణాది చిత్రంలో అక్షయ్ ఒబెరాయ్ నటిస్తుండటం మరో ఎత్తు. ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా... దీంతో పాటు నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఆపై దర్శకురాలిగా ప్రయాణాన్ని ప్రారంభించి తొలి ప్రయత్నంలోనే పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న గీతూ మోహన్ దాస్ 'టాక్సిక్'కు దర్శకత్వం వహించడం ప్రత్యేకమనే చెప్పాలి.
లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో యశ్ సినిమా చేస్తుండటం పెద్ద సాహసంగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ డ్రగ్ మాఫియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు ముందే పలు సంచలనాలు నమోదు చేసింది. మరి రిలీజ్ తరువాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం అక్షయ్ ఒబెరాయ్ సన్ని సంస్కారి కి తుల్సి సినిమాలో నటిస్తున్నాడు.
Also Read: