బాలీవుడ్ అగ్ర కథానాయకులలో ఒకరైన అక్షయ్ కుమార్ (Akshay Kumar)కు ఓ సర్జరీ జరిగింది. ముంబైలో ఆయనకు కంటి చూపు సవరణ శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అనీస్ బజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా 'కేరళం' (Keralam Movie) షెడ్యూల్‌ ముగించుకున్న వెంటనే ఆయన ఈ సర్జరీ చేయించుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

సర్జరీ ఎప్పుడు జరిగింది?అసలు స్టార్ హీరోకి ఏమైంది?అక్షయ్ కుమార్‌ (Akshay Kumar Eye Surgery)కు ఐ సర్జరీ ఎప్పుడు జరిగింది? అంటే... మే 6వ తేదీ (బుధవారం) ఉదయం. ఎందుకు సర్జరీ చేశారు? ఏమిటి? అంటే... కంటి చూపును మెరుగు పరచడానికి చిన్న సర్జరీ చేశారు. 

అక్షయ్ కుమార్ ఎప్పుడూ వరుస షూటింగులతో బిజీగా ఉంటారు. ఆయన క్షణం కూడా తీరిక లేకుండా పని చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.అయితే, సర్జరీ తర్వాత కోలుకోవడానికి కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని అక్షయ్ డిసైడ్ అయ్యారట.

Also Read: TVK Vijay - జీవాకు విజయ్ ఓదార్పు... ఆర్బీ చౌదరి పార్థీవ దేహాన్ని చూసి కన్నీరు మున్నీరు

అక్షయ్ సరసన రాశీ ఖన్నా, విద్యా బాలన్తెలుగు సూపర్ హిట్ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రానికి 'కేరళం' రీమేక్ అని టాక్. ఆ సినిమాలో అక్షయ్ కుమార్‌ సరసన విద్యా బాలన్, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులో వెంకటేష్ చేసిన పాత్రను అక్షయ్ కుమార్... ఐశ్వర్య రాజేష్ చేసిన పాత్రలో విద్యా బాలన్, మీనాక్షి చౌదరి రోల్ రాశీ ఖన్నా చేస్తున్నారని తెలిసింది.

Also ReadSA Chandrasekhar - ఎవరీ ఎస్ఏ చంద్రశేఖర్? తండ్రితో దళపతి విజయ్‌తో గొడవలు, కోర్టు దావా ఏమిటి?

Akshay Kumar Upcoming Movies: ఇటీవల 'భూత్ బంగ్లా'తో థియేటర్లలోకి వచ్చారు అక్షయ్ కుమార్. ప్రస్తుతం ఆయన చేతిలో 'వెల్కమ్ టు ది జంగిల్', 'హైవాన్', 'గోల్‌మాల్ 5', మరాఠీ సినిమా 'వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్', అలాగే 'కేరళం' ఉన్నాయి.

Also ReadPalash Muchhal - కులం పేరుతో తిట్టాడు... స్మృతి మాజీ ప్రియుడు పలాష్ మీద అట్రాసిటీ కేసు