బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రస్తుతం 'భూత్ బంగ్లా' సినిమా పనుల్లో ఉన్నారు. అదొక హారర్ కామెడీ సినిమా. దానిని ప్రసిద్ధ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తున్నారు. అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కలిసి దాదాపు 14 సంవత్సరాల తర్వాత కలిసి చేస్తున్న చిత్రమిది. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన లభించింది. ఇటీవల ఒక కార్యక్రమంలో అక్షయ్ కుమార్ కామెడీ సినిమాలు, తన కెరీర్ గురించి మనసు విప్పి మాట్లాడారు.

ఆ దర్శకుల నుంచి కామెడీ నేర్చుకున్నా

'ఇండియా టుడే కాన్‌ క్లేవ్ 2026'లో తాను దాదాపు 150 చిత్రాలలో నటించానని, 70 మందికి పైగా దర్శకులతో కలిసి పని చేసే అవకాశం తనకు లభించిందని అక్షయ్ కుమార్ చెప్పారు. అయితే... దర్శకుడు ప్రియదర్శన్‌తో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ప్రియదర్శన్‌తో కలిసి సినిమా చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుందని, ఆయన నుంచి కామెడీ గురించి ఎంతో నేర్చుకున్నానని అక్షయ్ అన్నారు. అలాగే, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి నుంచి కూడా కామెడీ టైమింగ్, నటనలో మెళకువలను అర్థం చేసుకున్నానని చెప్పారు. తనకు కామెడీ గురించి కొంచెం తెలిస్తే, అందులో ఈ ఇద్దరు దర్శకులదే ప్రధాన పాత్ర అని, కామెడీని ఎవరికీ నేర్పించలేమని, అది కళాకారుడి లోపలి నుండి వస్తుందని అక్షయ్ కుమార్ చెప్పారు.

Also Read: Harish Shankar: త్రివిక్రమ్‌తో పడలేదా? గొడవలు ఉన్నాయా? క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

కమెడియన్స్‌ గురించి, కామెడీ సినిమాలు చేసే నటుల గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ... ''ఏదైనా సన్నివేశంలో గ్లిజరిన్ ఉపయోగించి ఏడ్వడం సులభం. కానీ ఎవరినైనా మనస్ఫూర్తిగా నవ్వించడం చాలా కష్టం. అవార్డుల కార్యక్రమాలలో కామెడీ చేసే కళాకారులకు రావాల్సినంత గుర్తింపు రావడం లేదు'' అని అన్నారు. పూర్తి సినిమాలో కామెడీ చేసిన నటుడికి 'ఉత్తమ నటుడు' అవార్డు వచ్చినట్లు ఆయన ఎప్పుడూ చూడలేదని చెప్పారు. గొప్ప గొప్ప నటులు సైతం కామెడీ చాలా కష్టమైనదని భావిస్తారని అక్షయ్ తెలిపారు.

Also ReadOscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక

అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన 'భూత్ బంగ్లా' సినిమాలో పరేష్ రావల్, మిథిలా పాల్కర్, వామికా గబ్బి, రాజ్ పాల్ యాదవ్, జిషు సేన్‌గుప్తా, అస్రాని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

Also ReadPawan Kalyan Interview: సుమ కనకాలకు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్... 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూ